స్థిరాస్తి రంగం, లాటరీలపై పన్ను తగ్గించడమే అజెండాగా డిల్లీలో సమావేశమైన GST మండలి తమ నిర్ణయాన్ని ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి “అరుణ్ జైట్లీ” నేతృత్వంలో భేటీ అయిన ఈ మండలి రాష్ట్ర ప్రభుత్వలు నిర్వహించే లాటరీలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని లాటరీలపై ఏకరూప పన్ను విధింపు అంశంపై సుదీర్గంగా చర్చించింది.
కానీ ప్రస్తుతం ఉన్న రద్దీ నేపథ్యంలో జనవరి నెల రిటర్న్ లు దాఖలు గడువును అన్ని రాష్ట్రాలకు ఫిబ్రవరి 22 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. ఒక “జమ్ము కశ్మీర్” కు మాత్రం జనవరి నెల రిటర్న్ లు దాఖలు గడువును ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.