Home రాజకీయాలు జ‌గ‌న్‌పై కేసులో హైకోర్టుకు ఏపీ స‌ర్కార్‌..!

జ‌గ‌న్‌పై కేసులో హైకోర్టుకు ఏపీ స‌ర్కార్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం కేసును ఎన్ఐఏకు అప్ప‌గిస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. అయితే, న్యాయ‌స్థానం నిర్ణ‌యానికి ముందే దీనికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయ‌డాన్ని ఏపీ స‌ర్కార్ త‌ప్పుబ‌డుతోంది. దీనిపై కోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

వైఎస్ జ‌గ‌న్ మీద విశాఖ విమానాశ్ర‌యంలో అక్టోబ‌ర్ 25న కోడి క‌త్తితో దాడి జ‌రిగింది .ఈ కేసును మొద‌ట్నుంచి ఏపీ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఏపీ పోలీసుల విచార‌ణ‌పై అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేసిన వైసీపీ కేసును ఎన్ఐఏకు అప్ప‌గించాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేసింది. హైకోర్టు వైసీపీ ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్పింది. జ‌గ‌న్ కేసుపై గ‌తంలో జ‌రిగిన విచార‌ణ స‌మ‌యంలోనే హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎన్ఐఏ ద‌ర్యాప్తుకు మీరు ఆదేశిస్తారా..? లేక మేము ఆదేశించాలా.?? అని ప్ర‌శ్నించింది.

ఆ త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 31న ఎన్ఐఏను రంగంలోకి దించింది. జ‌న‌వ‌రి 1న ఎన్ఐఏ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు ఆమోదించింది. ప్ర‌భుత్వ న్యాయ‌వాది అభ్యంత‌రం చెప్ప‌డంతో కావాలంటే అప్పీలుకు వెళ్లొచ్చ‌ని సూచించిన హైకోర్టు ఎన్ఐఏకు కేసు విచార‌ణ అప్ప‌గించింది.

అయితే, ఈ ప‌రిణామాల‌పై ఏపీ సర్కార్ అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తోంది. జ‌గ‌న్‌పై దాడి కేసులో హైకోర్టు తీర్పుకుముందే ఎన్ఐఏకు అప్ప‌గిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేయ‌డం ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విఘాత‌మ‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. శాంతిభ‌ద్ర‌తల అంశం రాష్ట్ర ప‌రిధిలోనిద‌ని దీనిపై ఓ వైపు న్యాయ స్థానంలో కేసు న‌డుస్తుంద‌ని, నిర్ణ‌యం వెలువ‌డ‌క ముందే మ‌రోవైపు కేసు న‌మోదు చేయాల‌ని ఎన్ఐఏకు కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎలా జారీ చేసింద‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్న‌. రాష్ట్ర ప‌రిధిలోని అంశంపై ఆస‌క్తిని క‌న‌బ‌ర్చ‌డ‌మే కాకుండా రాష్ట్ర హ‌క్కుల‌ను కూడా గుంజుకోవాల‌ని కేంద్ర చూస్తోంద‌ని ఆరోపించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad