Home రాజకీయాలు ఏపి వార్తలు ప్రతిపక్షాలకు ఏపీ హైకోర్టు షాక్

ప్రతిపక్షాలకు ఏపీ హైకోర్టు షాక్

barandbench 2020 03 cda175af 047a 421b bf10 15354f898640 andhra pradesh HC 2

గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నిజమైన ప్రతిపక్షం హైకోర్టు అని బహిరంగంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రాజధాని తరలింపు మొదలుకొని భూముల వరకు ప్రతీ విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తూనే ఉంది. దీంతో మెజార్టీ ప్రజలు ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ కు వ్యతిరేకం అనే భావనకు వచ్చేశారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతిపక్షాలకు మొట్టికాయలు వేసింది. ఘాటైన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపించింది.

ప్రభుత్వ ప్రకటనల్లో జగన్ సర్కార్ పక్షపాత ధోరణి వ్యవహరించడంతో పాటు, ప్రభుత్వ అధికారి మరియు వాణిజ్య ప్రకటనల్లో సీఎం జగన్ తో పాటు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటో ఉండకూడదని కిలారి నాగశ్రవణ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ ను స్వీకరించిన హైకోర్టు సోమవారం నాడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ..“ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉండకూడదని మీరు అంటున్నారు? ఉంటే తప్పేంటి. వారు కూడా ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా…ఇలా ఫోటో వినియోగించకూడదని ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని  హైకోర్టు ప్రశ్నించింది.

పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది ద‌మ్మాల‌పాటి శ్రీ‌నివాస్ వాదిస్తూ..సుప్రీంకోర్టు గతంలో జారీ చేసినా ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని” అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినా తీర్పులో ఈ విషయం అసలు లేనేలేదని అటువంటప్పుడు జగన్ సర్కార్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎలా న‌డుచుకుంటోందో చెప్పవలసిందిగా కోరింది. దమ్మాలపాటి వాదిస్తూ ప్రభుత్వ ప్రకటనల్లో అధికార పార్టీ రంగులు వినియోగిస్తోందని కోర్టుకు తెలియజేశారు. దీనిపై ఒకింత ఆగ్రహానికి గురైన న్యాయస్థానం “పత్రికా ప్రకటన పై కేంద్ర, రాష్ట్రాలు ఏవైనా మార్గదర్శకాలు రూపొందించాయా? అని ప్రశ్నించింది. లేదని దమ్మాలపాటి చెప్పగా, అలా అయితే సుప్రీంకోర్టుకే వెళ్లి చెప్పండని ధర్మాసనం సూచించింది.

ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదిస్తూ “పిటిషనర్ చంద్రబాబు బాస్ అని అతను టీడీపీ చుట్టూ తిరుగుతుంటారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పత్రికా ప్రకటనలో పసుపు రంగును వాడటంతో పాటు అప్పటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పక్కన లోకేశ్, నారాయణ వంటి వారి ఫొటోలను విరివిగా వాడారని, అప్పుడులేని అభ్యంతరం హఠాత్తుగా ఇప్పుడు రావడం ఏమిటో తమకు అర్థం కావడం లేదని ఏజీ అన్నారు. దీనిని న్యాయస్థానం గుర్తించాలని వారు గుర్తు చేశారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనానికి పంపుతూ ఉత్తర్వులు జారీచేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad