Home రాజకీయాలు ఏపి వార్తలు జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ys jagan

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ప్రజల వద్దకే పరిపాలన కొనసాగించడానికి సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 1 నుండి ఇంటికే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు గాను ఇప్పటికే విధివిధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ సరుకులను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా సర్కార్ సరఫరా చేయనుంది.

నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలని దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మరియు ఈబీసీ యువతకు 60 శాతం సబ్సిడీ 30 శాతం లాభంతో ఈ వాహనాలను అందించనుంది. అంటే వారు కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆరేళ్ల తర్వాత వాహనం వారి పేరు మీదనే రిజిస్టర్ అవుతుంది. గత కొన్ని నెలలుగా  ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికీ గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు పాలన కొనసాగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు నగదు బదిలీ విధానాన్ని తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైన లబ్ధిదారులు బియ్యం తమకు వద్దనుకుంటే దానికి బదులుగా నగదు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది.

ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్స్‌పై ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిలో బియ్యానికి రూ.25 నుంచి రూ.30 ఇచ్చే అవకాశం ఉంది. ఇదే విధానాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిద్దాం అనుకున్నప్పటికీ వీలుపడలేదు. ఇప్పుడు ఈ విధానాన్ని జగన్ సర్కార్ అమలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad