పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పార్టీ నేతలు బరి తెగించారు. భీమడోలు మండలం లింగంపాడు దళితులపై రౌడీ యిజానికి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఓ ప్రధాన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధికి స్థానిక సమస్యలపై వినతిపత్రం అందించేందుకు వచ్చిన దళితులపై ఆయన అనుచరులు, కార్యకర్తలు దాడికి దిగారు.
రోడ్లు, డ్రైనేజీలు లేవని నిలదీయడంపై ఆయన అనుచరుల ఆగ్రహానికి కారణమైంది. ఆ పార్టీ అభ్యర్ధి సమక్షంలోనే ఆయన అనుచరులు దళితులపై పిడిగుద్దులు కురిపించారు. చెప్పులతో కూడా కొట్టారు. ఆ పార్టీ శ్రేణుల దాడిలో పలువురు దళితులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ దళితులు బీమడోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.