Home రాజకీయాలు ఏపి వార్తలు ఏపీలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

corona thumbb

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో ప్రజలు తమ ప్రాణాలను అరిచేత్తుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ భారత్‌లో తన ప్రభావాన్ని చూపిస్తూ ఉండటంతో వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజురోజుకూ తన పంజా విసురుతూ ప్రజలను తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ, ఏపీల్లో కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.

కాగా ఏపీలో కరోనా టెస్టులు భారీ సంఖ్యలో చేస్తుండటంతో అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంతే స్థాయిలో బయటపడుతున్నాయి. శుక్రవారం నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పరిస్థితి చేదాటకముందే సరైన చర్యలు, నివారణలు తీసుకుని కరోనా కేసుల సంఖ్యను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. జగన్ సర్కార్ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

కేవలం శుక్రవారం నాడే ఏపీలో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,04,065కు చేరింది. దానిలో 1,17,569 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా 84,654 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తానికి ఏపీని కరోనా వైరస్ అతలాకుతలం చేసే దిశగా వెళ్తుండటంతో ప్రభుత్వ అధికారులు, వైద్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad