Home రాజకీయాలు ఏపి వార్తలు మూడు రాజధానులు .. మూడు ముక్కలాట :

మూడు రాజధానులు .. మూడు ముక్కలాట :

Andhra pradesh will now have three capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాజధానులు వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొదటి నుంచి సంచలన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్న వైకాపా మూడు రాజధానులు విషయంలో ముక్కు సూటిగా వెళ్తుంది.మొదటి నుండి టిడిపి,జనసేన,తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్నప్పటికీ సీఎం జగన్ రాజధానుల విషయంలో పట్టుదలతో ఉన్నారు.

అటు ప్రతిపక్షాలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కోర్టులో కేసు ఉండగానే ఏపీ గవర్నర్ మూడు రాజధానుల బిల్లులకు ఆమోద ముద్ర తెలిపారు. సీఆర్డీఏ చట్టం 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు బిశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు. రాష్ట్రంలో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ రాజధానిగా కర్నూలు.. శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది. నేటి నుంచి రాష్ట్రంలో అధికారికంగా మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయి. అయితే ఇక్కడే అసలు సమస్యంతా వచ్చిపడింది. రాష్ట్రంలో మూడు ప్రతిపక్ష పార్టీ,మూడు రాజధానులు,3 సమస్యలు ఉన్నాయి.

మొదటి సమస్య గవర్నర్ బిల్లును ఆమోదించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చాకచక్యంగా గవర్నర్ చేత బిల్లును ఆమోదింపజేసుకునేంది. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీలు ఎవరు గవర్నర్ బిల్లుకు ఆమోదిస్తారని అనుకోలేదు. అయితే సీఎం జగన్ మాత్రం పూర్తి న్యాయ సలహా తీసుకొని బిల్లును ఆమోదింప చేసుకున్నారు, దీంతో మొదటి సమస్య తీరిపోయింది. ఇక రెండో సమస్య కోర్టులు. కర్నూలకు హైకోర్టు తరలింపుపై అంశంలో చిక్కుముడి పడే అవకాశం ఉంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లయితే హైకోర్టును కర్నూలుకు మార్చడం అంత సులభం కాదు. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉంటుంది.దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పడాలి.

ఒకవేళ ఆమోదముద్ర పడిన ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు వెళ్లడం తద్యం. అప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి. ఇటువంటి చిక్కుముడులు చాలానే ఉన్నాయి. వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందన్ని మేధావులకు వస్తున్న సందేహం. ఒకవేళ హైకోర్టు తరలింపు కేంద్రం నో చెబితే హైకోర్టును అక్కడే కొనసాగించి బెంచ్ మాత్రమే కర్నూలకు మార్చే అవకాశం ఉంది. మూడవ సమస్య రాష్ట్రంలో బీజేపీ-జనసేన సంయుక్త కూటమి గా ఉండటంతో కేంద్రం వైకాపాకు అనుకూలంగా ఉండే అవకాశం చాలా తక్కువ.దీంతో పాటు ఇప్పటికే జనసేన వైఎస్ఆర్.సిపీ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాల పెంచుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కోవిడ్ తో ప్రజలు మరణిస్తే ,ఇప్పుడు రాజధాని తరలింపు అవసరమా అని ప్రశ్నించారు.

అమరావతి రాజధానిగా ఉండాలని తన కోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో జనసేన అమరావతి లోని కొన్ని మండలాల భూసేకరణకు వ్యతిరేకిస్తున్న సందర్భంలో జనసేన వారికి అనుకూలంగా ఉంటూ రాజధానికి వ్యతిరేకంగా నినాదాలు తీసుకుంది. ప్రస్తుతం అదే జనసేన రాజధానికి అనుకూలంగా మాట్లాడుతూ, టిడిపి ఒకనాడు వైజాగ్ అనుకూలంగా మాట్లాడుతూ ఇప్పుడు వ్యతిరేకంగా తీర్మానం చేసింది, చివరకు బీజేపీ కూడా ఈ ఇదే స్వరాన్ని తీసుకుంది. ఇవన్నీ చూస్తున్నట్లయితే మూడు రాజధానులు మూడు ముక్కలాటగా మారిందన్నది నిజం.

- Advertisement -

Popular Stories

రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంది అంద‌రూ అనుకునే వ్య‌క్తి నుంచి కాదు తెలుసా….”

సినిమాల్లో వార‌స‌త్వం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. ముందు తండ్రులు ఆ త‌ర్వాత వారి కుమారులు, కుమార్తెలు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటారు. స‌క్సెస్ అయితే వాళ్ల...

వర్మ పవర్ స్టార్..రికార్డుల్లో సూపర్ స్టార్ !

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు గురించి ప్రత్యేకమైన ఇంట్రోలు, స్పెషల్ ఎఫెక్ట్ లు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వర్మ అంటే వివాదం,...

మగ‌ధీర‌కు 11 ఏళ్లు…ఇన్నేళ్ల‌లో రాజ‌మౌళి, రాంచ‌ర‌ణ్ ఏం సాధించారు

మ‌గ‌ధీర తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనే ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ. జూలై 31వ తేదీకి ఆ సినిమా రిలీజై 11 ఏళ్లు...

సినిమాల్లో ప‌డి పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయిన తార‌లు

ఏ స‌మ‌యంలో చేయాల్సింది ఆ స‌మ‌యంలోనే చేయాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అందుకే ఈడు రాగానే అమ్మాయిలకైనా అబ్బాయిల‌కైనా పెళ్లిళ్లు చేస్తుంటారు. అలా చేయ‌డం...

ఇగో లేని మ‌నిషి.. ప‌వ‌న్ క‌ల్యాణ్

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో వ‌చ్చిన  మొద‌టి సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. 2018 అక్టోబ‌ర్ లో రిలీజైన ఈ  సినిమా...
- Advertisement -

Related News

పెళ్ళైన రెండో రోజే ఆత్మహత్య!

కాళ్ల పారాణి ఆర‌లేదు. క‌ట్టిన తోరణాలు ఎండ‌లేదు. ఇంత‌లోనే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న క‌న్న బిడ్డ తిరిగిరాని లోకాల‌కు...

బ్రాండెడ్ కంపెనీలు వెల‌వెల‌…డిస్కౌంట్, ఆఫ‌ర్ బోర్డుల వెల్క‌మ్

బ్రాండెడ్ దుస్తుల కోసం చాలా మంది పోటీప‌డుతారు. బ్రాండ్ కంపెనీని బ‌ట్టి కొనేస్తుంటారు. ఎంత రేటు ఉన్నా స‌రే త‌మ‌కు న‌చ్చిన బ్రాండ్...

చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన 17 ఏళ్ల కుర్రాడు

భారత్ తో కయ్యానికి కాలు దువ్విన చైనా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంటా,బయట తగలుతున్న షాక్ లుతో కోలుకునే అవకాశం కూడా...
- Advertisement -