ఒకసాదరణ రైతు ఆత్మహత్యకు రాజకీయాలకు పెద్దగా సంబందం ఉండదు. ఒకవేల పంట పండక అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణం అయిన ప్రభుతాన్ని నిందిస్తాయి ప్రతిపక్షాలు. ఇక ఆ వెంటనే మేము అన్నీ బాగానే చేశాం.. మీకంటే మేమే బెటర్… ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు అంటూ ప్రభుత్వ ప్రతినిధులు స్పందిచి, చనిపోయిన ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తారు. అంతే మరుసటిరోజు ఆ రైతు కుటుంబాన్ని ఏ నాయకుడు పట్టించుకోరు కానీ ఇప్పుడు ఒక రైతు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.
పేరు కోటయ్య అలియాస్ కోటీశ్వరరావు, వృత్తి వ్యవసాయం.. యడ్లపాడు, చిలకలూరిపేటకు చెందిన ఈ రైతు తన పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. అది గమనించిన ఒక మహిళా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పక్కనే ఉన్న పోలీసులు కోటయ్యను బుజలపై వేసుకొని హాస్పటల్ కి తీసుకెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు.. అందుకు సంబందించి ఒక వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ కోటయ్యను మాత్రం బ్రతికించలేక పోయారు. దాంతో కోటయ్యను పోలీసులే హత్యచేశారని.. వీరి వెనక చంద్రబాబు ప్రభుత్వం కూడా ఉందని YSRCP నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలాఉంటే పోలీసులు మాత్రం ఈ హత్యకు మాకు ఎలాంటి సంబందం లేదని.. ఏదో ప్రమాదంలో ఉన్నాడు కదా అని జాలితో హాస్పటల్ కి తీసుకెళ్లమని, దాన్ని సాకుగా తీసుకొని మేమే ఈ హత్య చేశాం అనడం దారుణం అని మరో వీడియో చేసి రిలీజ్ చేశారు పోలీసులు.. మరోపక్క ప్రతిపక్ష నేతలతో పాటు ఆ గ్రామ ప్రజలు కూడా ఇది కేవలం పోలీసులు చేసిన హత్య.. కోటయ్య అంత పిరికివాడు కాదు.. అంత చేసి ఏదో కాపాడే ప్రయత్నం చేశాం అని నమ్మించడానికి ఒక వీడియో తీసి మాకు చూపిస్తున్నారు. ఇది అబద్దం అంటూ వాదిస్తున్నారు. కోటయ్య కుటుంబ సభ్యులు కూడా పోలీసులపై అనుమానంతో వారిపై కేసు పెట్టారు. మరీ ఇంతకీ ఏం జరిగింది ? ఈ హత్యకు బీజం ఎక్కడ పడింది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం కొండవీడు ఉత్సవాలకు హాజరైన AP ముఖ్యమంత్రి “చంద్రబాబు నాయుడు” గారి హెలికాప్టర్ ఆగటం కోసం, వాహనాల పార్కింగ్ కు రైతు కోటేశ్వరరావు పొలంలో ఉన్న చెట్లను, పంటను పోలీసులు నాశనం చేశారు. అది చూసిన కోటయ్య ఇదేమి అన్యాయమని ప్రశ్నించాడు.. దాంతో కోపం వచ్చిన పోలీసులు CM కంటే నీపొలం ఎక్కువా ? అని అతడిపై చేయి చేసుకున్నారు.. దాంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన కోటయ్యను పోలీసులు ఏమి తెలియానట్లుగా భుజాలపై వేసుకొని వాహనంలోకి తరలిస్తున్న దృశ్యాలు వీడియో తీసి నెట్ లో పెట్టారు.. దానికి ఇప్పుడు కోటయ్య పురుగుల మందు తాగి హాత్మహత్య చేసుకోబోయాడు.. అది గమనించిన మేము అతడిని హాస్పటల్ కి తీసుకెళ్ళాం అంటూ కొత్త కథ చెబుతున్నారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త.
మరీ ఈ వార్తలో నిజం ఎంత ? పోలీసులు చెబుతుంది నిజమా ? లేక స్థానికులు చెబుతుంది నిజమా ? ఏది నిజం ఏది అబద్దం ? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో కోటయ్య ఆత్మహత్య కాస్త రెండు రాజకీయ పార్టీల వార్ గా మారింది. ఈ వార్ లో చివరికి ఎవరు గెలుస్తారు ? ఎవరికి కోటయ్య మరణం అనుకూలం కాబోతుంది అని తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగలి.