Home రాజకీయాలు ఏపి వార్తలు వైఎస్సార్ బీమా: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

వైఎస్సార్ బీమా: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

ys jagan

సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూర్చేలా నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. తాజాగా వైయస్ జగన్ సర్కార్ వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయనుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రేషన్ కార్డు ఉండి కుటుంబం పై ఆధార పడ్డ వ్యక్తి మరణిస్తే వారికి ప్రభుత్వం బీమా చెల్లించనుంది. గతంలో ఎల్‌ఐసీతో కలిసి ఈ పథకాన్ని అమలుపర్చాలి అనుకున్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ పథకం నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం సొంత నిధులతోనే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తారు. శాశ్వత వైకల్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు అందుతాయి.  దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ప్రభుత్వం విడుదల చేసింది.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad