Home రాజకీయాలు ఏపి వార్తలు కమలం గూటికి వంగవీటి..?

కమలం గూటికి వంగవీటి..?

Vangaveeti Radha To Join BJP

ఏపీ రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకోవడంతో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆలోచనలో పడ్డారు. కాగా ఇప్పుడున్న నేతల్లో కూడా చాలా మంది టీడీపీ నుండి వేరే పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత వంగవీటి రాధా కూడా వేరే పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో వైసీపీలో ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో టీడీపీలో చేరిన వంగవీటి రాధా, ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో ఓ కేంద్రమంత్రితో రాధా సంప్రదింపులు జరుపుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీలో ప్రాముఖ్యం గల పదవిని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అతి త్వరలో కాషాయం కండువా కప్పుకోవడం ఖాయమని పలువురు అంటున్నారు.

అయితే ఈ వార్తలపై అటు వంగవీటి రాదా గాని, టీడీపీ అధినేత చంద్రబాబు గాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో వంగవీటి పార్టీ మారడం దాదాపు ఖరారే అంటున్నారు ఏపీ టీడీపీ నేతలు. ఏదేమైనా ఏపీలో టీడీపీకి చాలా గడ్డుకాలం నడుస్తుందని, తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ఈ వలసలు తప్పవని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad