Home రాజకీయాలు ఏపి వార్తలు చెప్పులు అమ్ముకుంటున్న టీచర్

చెప్పులు అమ్ముకుంటున్న టీచర్

pic

కరోనా దాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కేంద్రం లాక్ డౌన్ ను ప్రకటించటంతో మెజారిటీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి. గత 150 రోజులుగా పాఠశాలలు మరియు ఇతర విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో వీటిపై ఆధారపడి పనిచేసే ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది రోడ్డు పాలయ్యారు. ముఖ్యంగా ప్రైవేటు ఉపాధ్యాయులు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వీరికి ఉపాధ్యాయ వృత్తి ఒక్కటే ఆధారం కావడంతో పరిస్థితి ఈ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతబడి ఉండటంతో వీరికి ఉపాధి లభించగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి పలికి కూలీపని చేస్తూ ఉండగా మరికొంతమంది వ్యవసాయాన్ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే తాజాగా విజయవాడలో జరిగిన ఓ సంఘటన అందరిని కంటతడి పెట్టించింది.

వెంకటేశ్వర రావు అనే ఉపాధ్యాయుడు ఉపాధి లేక రోడ్డు మీద కూర్చొని చెప్పులు అమ్ముకుంటున్నాడు. గతంలో ఇతడు వివిధ విద్యా సంస్థల్లో గణిత ఉపాధ్యాయుడుగా పని చేశాడు. ప్రస్తుతం పాఠశాలలో మూతపడి ఉండడంతో కుటుంబ భారం పెరిగిందని, కనీసం ఇంట్లో తినడానికి ఆహారం కూడా లేదని అందుకే చెప్పులు అమ్మ కుంటున్నట్లు తెలిపాడు. ప్రైవేట్ ఉపాధ్యాల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.

దేశంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వారిని ఆదుకోవాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి ఈ విధంగా ఉంటే,  కూలీల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయన్నది మేధావులు కూడా అందని ప్రశ్నగా మిగిలిపోయింది.  ఏదిఏమైనప్పటికీ కరోనా సామాన్య ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిందన్నది వాస్తవం. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad