Home రాజకీయాలు ఏపి వార్తలు కేంద్రం సంచలన నిర్ణయం: అన్‌లాక్‌ 4.0

కేంద్రం సంచలన నిర్ణయం: అన్‌లాక్‌ 4.0

untitled 7

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్  ఈనెల 31తో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ లాక్ 4.0 భాగంగా పలు కీలకమైన రంగాలకు సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా అంతరాష్ట్ర ప్రయాణాలు మరియు రాజకీయ సమావేశాలు, మెట్రోరైలు సంబంధించి కీలకమైన సడలింపులను కేంద్రం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 7 నుండి దశలవారీగా మెట్రో రైలు సేవలు మొదలు కానున్నాయి. నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలను పూర్తిగా ఎత్తి వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంతరాష్ట్ర ప్రయాణాలు ఇక నుంచి మరింత సులభతరం కానున్నాయి. పౌరులు స్వేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు వెళ్లవచ్చని కేంద్రం తెలిపింది. అయితే సెప్టెంబర్ 31 వరకు పాఠశాలలు మరియు మాల్స్ తెరవకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రకటించిన విధంగా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం పేర్కొంది. 

అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు : 

  • సెప్టెంబర్ 7 నుండి దశలవారీగా ప్రారంభంకానున్న మెట్రో రైలు సేవలు.
  • సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు,సినిమా థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్ బంద్‌.
  • రాజకీయ సమావేశాలకు అనుమతి(గరిష్టంగా 100 మంది ఉండే అవకాశం) 
  • రాజకీయ సమావేశాల్లో భౌతిక దూరం, మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరి.
  • అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు. 
  • కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు యథాస్థితి.
  • అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి.
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad