Home రాజకీయాలు ఏపి వార్తలు ఆ హీరోకు వార్నింగ్ ఇచ్చిన కొడాలి నాని

ఆ హీరోకు వార్నింగ్ ఇచ్చిన కొడాలి నాని

Kodali Nani Warning To Ram Pothineni

ఏపీలో ఇటీవల జరిగిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న కేంద్రంగా స్వర్ణ ప్యాలెస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్నిప్రమాదం సంభవించి పలువురు రోగులు మృత్యువాత పడ్డారు. అయితే రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

ఈ ప్రమాదంపై కోర్టులో సాగుతున్న కేసులో రమేష్ ఆసుపత్రిని అన్యాయంగా ఇరికించారంటూ తెలుగు యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల ట్వీట్ చేశాడు. దీంతో పలువురు రామ్ పోతినేనిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మంత్రి కొడాలి నాని చేరారు. తాజాగా కొడాలి నాని, ఆళ్ల నాని, వెల్లంపల్లి, పెద్దిరెడ్డి కలిసి రమేష్ ఆసుపత్రి బాధితుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు.

ఈ క్రమంలో కొడాలి నాని మాట్లాడుతూ.. హీరో రామ్ అసలు నిజాలు తెలియకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. రమేష్ వెనుక చాలా పెద్దవారు ఉన్నారని, వారి అండ చూసుకునే రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లాడని, ఆయన ఎలాంటి తప్పు చేయకపోతే కోర్టులో హాజరు కావాలని కొడాలి నాని కోరారు. ఇలా తప్పుడు వ్యక్తులకు హీరో రామ్ వంతపాడటం మంచిది కాదని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం మరోసారి స్వర్ణా ప్యాలెస్ అంశం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad