Home రాజకీయాలు ఏపి వార్తలు జగన్ సర్కార్ సంచలన నిర్ణయం:ప్రజలకు గుడ్ న్యూస్

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం:ప్రజలకు గుడ్ న్యూస్

ys jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలను భారీగా తగ్గిస్తునట్టు ప్రకటించింది. గతంలో కరోనా టెస్ట్ చేయడానికి రూ.2400 ఖర్చు అవుతుండగా నేడు ఆ ధరను రూ.1900 కుదిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్లు  సంఖ్య భారీగా పెరగడంతో ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సరికొత్త టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రావడంతో ధరలు తగ్గి ప్రజలకు లాభాన్ని చేకూర్చుతున్నాయి అని ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు దాదాపు 70 వేలకు పైగా కరోనా టెస్ట్ లు జరుగుతున్నాయి. ఇదే స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఏపీలో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తారాస్థాయికి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 10,830 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో పాజిటి వ్ కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 92,208 కాగా, 2,86,720 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 3541కి చేరింది. ఏపీలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 53,567 పాజిటివ్ కేసులు నమోదు కాగా అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 299 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఇరవైఒక్క మంది వైరస్ కారణంగా మరణించగా ఇప్పటి వరకూ 34,18,690 సాంపిల్స్ పరీక్షించారు. అక్టోబర్ నుండి అన్ లాక్ 4.0 అమలులోకి వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల ను ప్రారంభించింది. ఇక జాతీయ స్థాయిలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 75,,760 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1023 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. ఇప్పటిదాకా 60,472 మంది మరణించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad