Home రాజకీయాలు ఏపి వార్తలు మీరు దళిత ద్రోహులు:పుష్పశ్రీవాణి

మీరు దళిత ద్రోహులు:పుష్పశ్రీవాణి

unnamed file 4

విశాఖపట్నం దళిత యువకుడి శిరోముండనం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసింది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంటే దానికి వైకాపా పార్టీ దీటుగా సమాధానం చెబుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ వారిపై పదునైన విమర్శనాస్త్రాలను సంధించారు. చంద్రబాబు ఓ సమావేశం మాట్లాడుతూ “ ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా” అంటూ వారిని అవమానించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పుష్ప శ్రీవాణి గుర్తు చేశారు.

మరోసారి ఎస్టీలకు తెలివి ఉండదని చంద్రబాబు అవహేళన చేశారని, వారిని చూసి ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక పార్టీ తమదేనని అన్నారు. ఇప్పటివరకు ఒక కోటి 35 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు సంక్షేమ ఫలాలను అందించే మొట్టమొదటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని తెలిపారు. మరోవైపు ఇప్పటికే అణగారిన వర్గాలకు 13వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించమని అన్నారు.

దళితులు, గిరిజనులపై దాడులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని’’ మంత్రి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. గతంలో చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇది తెలుగుదేశం ప్రభుత్వం అని పలువురు మంత్రులు విమర్శించారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad