Home రాజకీయాలు ఏపి వార్తలు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా

coronavirus blue 1 1

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం…ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,589కు చేరింది. గడచిన 24 గంటల్లో 10 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 846కి చేరింది. గడచిన 24 గంటల్లో 2,240 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు రాష్ట్రం వ్యాప్తంగా 97,402 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.3% ఉండగా, దేశవ్యాప్తంగా కరుణ రికవరీ రేటు 76.49 శాతంగా ఉంది. అత్యధిక కరోనా కేసులు జీహెచ్‌ఎంసీలో పరిధిలోనే నమోదు కావడంతో బల్దియా అధికారులు కట్టుదిట్టమైన చర్యలను ప్రారంభించారు. ర౦గారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో78,357పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 8,463 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,48,330 రికవరీ అయినట్టు వైద్యారోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా  ఇప్పటి వరకు 33,87,501 కరోనా కేసులు నమోదు కాగా, 25,83,948 మంది కోలుకున్నారు. ప్రస్తుతం7,42,023 మందికి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ అదేస్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఉండటంతో పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad