Home రాజకీయాలు ఏపి వార్తలు రాజధానిపై చంద్రబాబు రాజీనామాస్త్రం

రాజధానిపై చంద్రబాబు రాజీనామాస్త్రం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలుపడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఏపీ రాజధానిని అమరావతి నుండి వేరొక ప్రాంతానికి మార్చడం, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి సొంత ప్రయోజనాల కోసమేనని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.

కాగా రాజధానిని అమరావతి నుండి తరలించడం పూర్తిగా అన్యాయమని, ఇది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే చర్యగా ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి లాంటి ప్రాజెక్టును అడ్డుకుంటే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా చంద్రబాబు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సహా టీడీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని, తద్వారా ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఆదివారం నాడు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి సామూహికంగా రాజీనామా పత్రాలను అందించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. అయితే కేవలం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల మద్దతు కోసమే బాబు ఇలాంటి చిల్లర రాజకీయం చేస్తున్నారని వైకాపా నేతలు అంటున్నారు. మరి ఈ సామూహిక రాజీనామాస్త్రం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...
- Advertisement -