
తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పెట్టిన కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గతకొన్నేళ్లుగా వారు తన నగ్న చిత్రాలు, వీడియోలు తీసి తనను బ్లాక్మెయిల్ చేస్తూ, తనపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును వారు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అయితే ఆమెపై నిజంగా 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారికి ఓ ట్విస్టు ఇచ్చింది సదరు బాధితురాలు. తాజాగా ఆమె ఈ కేసుపై కొన్ని ఆసక్తికర విషయాలను మీడియా ముందు వెల్లడించింది. తనను 139 మంది రేప్ చేయలేదని, వారిలో కేవలం 44 మంది మాత్రమే తనపై అత్యాచారం చేశారని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఆమెను ‘డాలయ్ భాయ్’ అనే వ్యక్తి బెదిరించి ఈ కేసులో సంబంధం లేని వారి పేర్లను చేర్పించాడని బాధితురాలు తెలిపింది.
పలువురు ప్రముఖులతో ఈ డాలర్ భాయ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, వారికి అమ్మాయిల వల వేసి వారిని నిలువునా ముంచుతున్నాడని బాధితురాలు వెల్లడించింది. దీంతో పోలీసులు ఆ డాలర్ భాయ్‌ను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే విషయం తెలుసుకుని అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు లాంటి వారికి ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపింది.