Home రాజకీయాలు ఏపి వార్తలు కరోనా నేపథ్యంలో బాలయ్య విరాళం

కరోనా నేపథ్యంలో బాలయ్య విరాళం

Balakrishna To Donate PPE Kits In Hindupur

కరోనా వైరస్ కారణంగా మనుష్యులు తమ తోటివారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఇతరులకు సాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో రాజకీయ నేతలు మొదలుకొని సినీ ప్రముఖుల వరకు ఉన్నారు. కాగా వారిలో భారతేదశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు కరోనా నేపథ్యంలో తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం CCC అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సాయం అందిస్తున్నారు. కాగా మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పటికే పలువురికి సాయం అందిస్తున్నాడు. గతంలో సినీ కార్మికుల కోసం రూ. 1.25 కోట్లు అందజేయగా, ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గం అయిన హిందుపూర్‌లోని కరోనా సెంటర్‌కు అవసరమైన రూ.55 లక్షల విలువైన పీపీఈ కిట్లు, మాస్క్‌లు మరియు ఇతర సామగ్రిని అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో హిందుపూర్ ప్రజలు బాలయ్య చేస్తున్న మంచిపనికి ఫిదా అవుతున్నారు.

గతంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా 12 వేల మందికి కరోనా నిరోధక హోమియోపతి మందులను అందించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా కరోనా మహమ్మారి నుండి కాపాడుకునేందుకు ప్రజలకు, అధికారులకు అవసరమై మందులు, నివారణ సామగ్రిని అందిస్తూ ఇతరులకు స్పూ్ర్తిగా నిలుస్తున్నాడు బాలయ్య. ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య ఇప్పటికే తన కొత్త చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad