Home రాజకీయాలు ఏపి వార్తలు ఏపీలో ప్రత్యేక కరోనా హెల్ప్‌లైన్ ఏర్పాటు

ఏపీలో ప్రత్యేక కరోనా హెల్ప్‌లైన్ ఏర్పాటు

ys jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకమైన హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. తాజాగా ఏపీ గవర్నమెంట్ కరోనా నివారణకు హెల్ప్‌లైన్‌ నెంబర్‌ అందుబాటులోకి తెచ్చింది. కరోనాపై సమగ్ర సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ 82971 04104 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. ఈ నెంబర్ 24 గంటలు పని చేయనుందని అధికారులు స్పష్టం చేశారు.

ఈ హెల్ప్ లైన్ ద్వారా కరోనా లక్షణాలు, కరోనా పరీక్షల వివరాలు, హోమ్‌ ఐసోలేషన్‌లో  తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి వాటి పై అధికారుల సమాచారం ఇవ్వనున్నారు. దీంతోపాటు దగ్గరలోని కొవిడ్‌ సెంటర్ల సమాచారం మరియు ఆంబులెన్స్ సాయం వంటి వివరాలను కూడా తెలియజేశారు. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెలిమెడిసిన్ కొరకు 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ చాలా మంది ప్రజలకు కరోనా సోకితే ఏం చేయాలో? ఎక్కడికి వెళ్లాలనే దానిపై అనేక సందేహాలు ఉండటంతో ముఖ్యమంత్రి ఈ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

బుధవారం 57,148 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 9,597 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య  2,54,146కు చేరింది. అధికారిక సమాచారం ప్రకారం బుధవారం ఒక్కనాడే ఏకంగా 93 మంది కరోనా బారినపడి మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 2,296కు పెరిగింది. గ్రామాలు మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో కరోనా ఉధృతిని కంట్రోల్ చేయడానికి ఈ హెల్ప్‌లైన్  తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad