
కరోనా వైరస్ తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే భారత్లో కరోనా మహమ్మారి రాజ్యం ఏలుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆంధ్ర ప్రేదేశ్లో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఏపీలో గడిచిని 24 గంటల్లో కొత్తగా 9393 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గురువారం నాటికి నమోదైన 9393 కొత్త కేసులతో కలుపుకుని ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 325396కి చేరింది. వారిలో 235218 మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా 87177 మంది చికిత్స పొందుతున్నారు. అటు ఇప్పటివరకు ఏపీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3001కి చేరింది. కాగా ఇప్పటివరకు ఏపీ రాష్ట్రంలో 3074847 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇక గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 1357 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కృష్ణాలో 195 కేసులు నమోదయ్యాయి. కాగా గడిచిన 24 గంటల్లో 8,846 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చా్ర్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.