Home రాజకీయాలు ఏపి వార్తలు ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

vijcheckpost3

నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4 అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇదివరకే ప్రకటించింది. దీనిలో భాగంగా కంటైన్మెంట్‌ జోన్లలో మినహా ఇతర అన్ని ప్రాంతాల్లో అన్‌లాక్ 4 అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రకటించిన సడలింపుల్లో ముఖ్యమైనది అంతరాష్ట్ర ప్రయాణాలు. ఇదివరకు అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేయాలంటే ఆయా రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సి ఉండేది. కానీ తాజా కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేసి ఉంది. ఇకనుండి తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ కు స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగనున్నాయి.

ఇప్పటికే  గుంటూరు జిల్లాలోని పొందుగుల చెక్‌పోస్టుతో పాటూ విజయవాడ మరియు ఇతర చెక్ పోస్టులలో ఆంక్షలు ఎత్తివేశారు. ఇది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే స్పందన వెబ్ సైట్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. ఆ తర్వాత మొబైల్ కు ఎంట్రీ పాస్ లభిస్తుంది. చెక్ పోస్ట్ వద్ద అంతరాష్ట్ర సిబ్బందికి ఈ పాస్ తో గుర్తింపు కార్డును చూపినట్లయితే వారు రాష్ట్రంలోకి అనుమతిస్తారు. ప్రస్తుతం కేంద్రం ఆదేశాలతో ఈ ఆంక్షలన్ని పూర్తిగా తొలగిపోయాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తుల నుండి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత వారిని రాష్ట్రంలోకి అనుమతించేవారు. ఒక వేల వారికి కరోనా సోకినట్లు అయితే వారిని త్వరితగతిన గుర్తించి క్వారంటైన్ కు తరలించే అవకాశం ఉండేది. కేంద్రం తాజా నిర్ణయంతో పరిస్థితులను ఒక్కసారిగా తలకిందులయ్యాయి. దీని వలన రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అభిప్రాయపడుతోంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad