Home రాజకీయాలు బైక్ రైడింగ్‌లో అబ్బాయిల‌కు పోటీ ఇస్తున్న అమ్మాయి

బైక్ రైడింగ్‌లో అబ్బాయిల‌కు పోటీ ఇస్తున్న అమ్మాయి

Anam Hashim

బైక్ రైడింగ్ అంటే ఓన్లీ జంట్స్ కు మాత్ర‌మే ప‌రిమితం అనేది చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది త‌ప్పు అంటోంది ఓ యువ‌తి. బైక్ రైడింగ్ కైనా, రేసింగ్ కైనా మ‌గ‌వారితోనైనా రెడీ అంటోంది 26 ఏళ్ల అన‌మ్ హ‌షిమ్‌. ల‌క్నోలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి….బైక్ రైడింగ్ అంటే పిచ్చి. అన్నం లేకుండా అయినా ఉంటుందేమో కానీ…బైక్ స్టంట్స్ చేయ‌కుండా మాత్రం ఉండ‌లేదు. అన‌మ్ హాషీమ్‌కు సాహాసాలంటే చాలా ఇష్టం. చిన్న య‌వ‌సులోనే బైక్ స్టంట్ రైడర్ కావాల‌ని బ‌లంగా కోరుకుంది. చిన్న‌ప్ప‌టి నుంచే మోటార్ సైకిల్ అంటే చాలా ఇష్టం. ప‌ద‌వ త‌ర‌గ‌తి నుంచే దాని గురించి తెలుసుకుంది. అమ్మాయిల్లో చాలా మంది తాము ఇంజనీర్ లేదా డాక్ట‌ర్ కావాల‌ని క‌లలు క‌నేవారు. కానీ అన‌మ్ మాత్రం చిన్న‌ప్ప‌టి నుంచి స్టంట్ డ్రైవింగ్ చేయాల‌ని కోరుకునేది. కానీ ఆమె పేరంట్స్ మాత్రం చాలా భ‌య‌ప‌డేవారు. అమ్మాయిలు ఇలాంటివి చేయ‌కూడ‌ద‌ని అనుకునేవాళ్లు. ఒక వేళ బైక్ రైడింగ్ లో పొర‌పాటున కింద ప‌డి ఎముక‌లు ఏమైన విరిగిపోతే…ముఖానికి ఏదైనా అయితే ఎవ‌రు పెళ్లి చేసుకుంటారు అని భ‌య‌ప‌డేవారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలో కూడా అన‌మ్ హ‌షిమ్‌కు అర్ధ‌మ‌య్యేది కాదు. స్టంట్ రైడింగ్ కూడా ఒక ఉద్యోగమా….ను‌వ్వు పిచ్చిదానివా,,,,అ‌ని అంద‌రూ ఎగ‌తాళి చేసేవారు. బైక్ నేర్చుకునే ఏం చేస్తావ్…దొంగ‌త‌నాలు చేస్తావా లేదా అబ్బాయిల్లా రేసింగ్కు వెళ్తావా అని ప్ర‌శ్నించారు.

కానీ అన‌మ్ హ‌షిమ్ దృష్టి మొత్తం బైక్ రైడింగ్ పైనే ఉండేది. నిజానికి త‌న‌కు బైక్ న‌డ‌ప‌డం అంటే చాలా సాధ‌రణ‌మైన విష‌యం. తాను ఎవ‌రూ చేయ‌ని ప‌ని చేయాల‌నుకునేది. ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే……బైక్ రైడింగ్ ఆమెకు ఎవ‌రూ నేర్ప‌లేదు . యూట్యూబ్ లో వీడియోస్ చూసి నేర్చుకుంది‌. త‌న‌కు ఎప్పుడూ స్టంట్ వీడియోలు చేయాల‌ని ఉండేది. దీని కోసం క్లాసులు కూడా బంక్ కొట్టేది. విష‌యం ప్రిన్సిపాల్ వ‌ర‌కు వెళ్లింది. ఇంట్లో వాళ్లు కూడా చాలా తిట్టారు. బైక్ తీసుకుంది మామూలుగా న‌డ‌ప‌డానికి కాదా…స్టంట్స్ చేయ‌డానికా…పైగా క్లాసులు కూడా బంక్ కొడుతున్నావా అని చెడామ‌డా తిట్టేశారు. ప్ల‌స్ టు త‌ర్వాత ల‌క్నో నుంచి వాళ్ల ఫ్యామిలీ పూణెకు షిప్ట్ అయ్యింది. అక్క‌డ కూడా మొద‌టి ఏడాది వ‌ర‌కు బాగా స‌పోర్ట్ ల‌భించింది. కానీ స‌హ‌చ‌ర మేల్ బైక్ రైడ‌ర్స్ …ఆమెను నిరుత్సాహాప‌రిచేవారు. ప‌దేళ్ల నుంచి ఈ ఫీల్డ్ లోనే ఉన్నామ‌ని….మాకు అంత విలువ ఇవ్వ‌ర‌ని…. మా ద‌గ్గ‌ర‌కు మంచి మంచి బ్రాండ్ల కంపెనీలేమీ లేవ‌ని.. మాకు అంత ఫాలోయింగ్ కూడా లేద‌ని అంటుండేవారు. నువ్వు ఏమో ఇప్పుడు వ‌చ్చి…. పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించ‌వు అని అసూయ‌ప‌డేవారు. అలాంటివాటిన‌న్నింటిని ఎదుర్కొని త‌న‌కు న‌చ్చిన బైక్ రైడింగ్ పైనే దృష్టి పెట్టింది. పుణెలో స్టంట్ షోలు చేసేది. కాలేజీ ఫెస్ట్ ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేది, చేసే ప‌నితో డ‌బ్బులు సంపాదించ‌గ‌ల‌న‌ని అప్పుడే తెలిసింది. త‌న‌ మొద‌టి షూటింగ్ 18 రోజుల పాటు సాగింది. 2015లో షూటింగ్ బృందంతో క‌లిసి ఒక్క‌టే 2 వేల 150 కిలోమీట‌ర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. ఆ ట్రిప్ త‌న‌ జీవితాన్ని మార్చేసింది. 2016 లో టీవీఎస్ స్కూటీకి ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా తీసుకున్నారు. క‌ర్దుంగులా లాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన రోడ్డుపై …… 110 సీసీ న‌డిపిన తొలి మ‌హిళ‌గా లిమ్కా బుక్ రికార్డుల్సో చోటు ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం క్రాస్ కంట్రీ ర్యాలీ రేస్ లో పాల్గొంటోంది. గ‌తేడాది డిజ‌ర్ట్ స్టామ్ రేస్‌ను పూర్తి చేశాను. దీనిని తొలి ప్ర‌య‌త్నంలోనే పూర్తి చేసిన తొలి మ‌హిళ కూడా అన‌మ్ హ‌షిమే. ప్ర‌స్తుతం ఆమె ముందున్న గోల్ ఒక్క‌టే. బైకు అమ్మాయి న‌డుపుతుందా అబ్బాయి న‌డుపుతున్నాడా అనే తేడా తెలియ‌దు. ఎవ‌రు న‌డుపుతున్నార‌నేది ఏ బైక్‌కు తెలియ‌దు. ఈ తేడాను ప్రపంచానికి తెలియ‌జేయాల‌ని అనుకుంటున్నాన‌ని చెబుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad