Home రాజకీయాలు ఏపి వార్తలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి! : చిచ్చు రేపిన మ్యాప్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి! : చిచ్చు రేపిన మ్యాప్

BL06 BP AMARAVATHI1

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంశం అగ్గి రాజేస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా అమరావతి రాజధాని పై సర్వే ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఆర్డీఏ బిల్లును రద్దు చేసి వికేంద్రీకరణ కు జై కొట్టింది. ప్రస్తుతం రాజధాని అంశం కోర్టులో ఉంది. కేసు కోర్టులో ఉండగానే సర్వే ఆఫ్ ఇండియా అమరావతి రాజధాని గా పేర్కొంటూ మ్యాప్ ను విడుదల చేసింది. గతేడాది నవంబర్ 21న లోక్‌సభ జీరో అవర్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కేంద్రాన్ని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో స్పష్టత ఇవ్వాలని సర్వే ఆఫ్ ఇండియాను కోరారు.

సర్వే ఆఫ్ ఇండియా దీనికి రాతపూర్వక సమాధానాన్ని ఇచ్చింది. దీని ప్రకారం సర్వే ఆఫ్ ఇండియా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తామని తెలిపింది. ఇప్పటికే తమ తాజా రాజకీయ మ్యాపుల్లో అమరావతిని చేర్చినట్లు తెలిపింది. 2019లో రూపొందించిన ఇంగ్లీష్‌ ఎడిషన్‌తో పాటు 2020లో రూపొందించిన హిందీ ఎడిషన్ మ్యాపుల్లోనూ అమరావతిని రాజధానిగా ఉంటుందని సర్వే ఆఫ్ ఇండియా సమాధానం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో ఇటువంటి అనూహ్య పరిణామం ఎదురవడం వైకాపా నాయకులును కలవరపెడుతోంది. సర్వే ఆఫ్‌ ఇండియా వంటి ప్రతిష్టాత్మక సంస్ధ తమ మ్యాప్‌ల్లో అమరావతిని చేర్చడం వైకాపా ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు వంటిదని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.వాస్తవానికి గత ఏడాది విడుదల చేసిన మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి లేనేలేదు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా కేంద్రం అమరావతి రాజధానిగా చర్చితో సరికొత్త వ్యాప్ ను విడుదల చేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad