Home రాజకీయాలు పవన్, నాగబాబులకు అల్లు అర్జున్ మద్దతు : మేమెప్పుడు మీవెంటే

పవన్, నాగబాబులకు అల్లు అర్జున్ మద్దతు : మేమెప్పుడు మీవెంటే

చెప్పాను బ్రదర్.. అనే ఒకే ఒక్క డైలాగ్ మెగా ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని వేరు చేసింది. అప్పటివరకూ రెండు కుటుంబాలు వేరువేరు కాదు ఒక్కటే అన్న మెగా అభిమానులు అల్లు అర్జున్ ని దూరం పెట్టారు. ఎలాగైనా అతడి సినిమాలు ప్లాప్ కావాలని ఎన్ని చేయాలో అన్ని చేశారు. అందుకు కారణం కేవలం పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని బన్నీని అడిగితే “చెప్పాను బ్రదర్” అనడమే. దాంతో ఎలాగైనా మళ్ళీ పవన్ అభిమానుల మనసు గెలుచుకోవాలని బన్నీ చాలా రోజులుగా వైట్ చేస్తున్నాడు.

ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. నిజానికి బన్నీ అంటే పవన్ అభిమానులకు క్షణిక కోపం తప్ప, మరీ క్షమించలేనంత కోపం లేదు. అందుకే ఒకేఒక్క ట్వీట్ తో బన్నీ కూడా మావాడే అని ఆనందంలో మునిగిపోయారు పవన్ అభిమానులు. ఇంతకీ అల్లు అర్జున్ పెట్టిన పోస్టు ఎంతో తెలుసా ?.. “ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలను ఎంచుకున్న నాగబాబుకు శుభాకాంక్షలు. ఈ రాజకీయ ప్రయాణంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా.  ఎన్నికల ప్రచారంలో మీతో మేము లేకున్నా.. మీకు, సమాజ అభివృద్ధికి  ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుంది. రాజకీయాల్లో విజయవంతంగా రాణిస్తున్న పవన్‌ కళ్యాణ్, జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ  అభినందనలు. పవన్‌ కళ్యాణ్ న్యాయకత్వం, అద్భుతమైన విజన్‌ తో ఏపీ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తారని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్.

Read Also: నిజామాబాద్‌ పోలింగ్‌ చరిత్రలో నిలిచిపోతుంది : రజత్‌ కుమార్‌

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad