జమ్ముకశ్మీర్, “పుల్వామా”లో జరిగిన ఉగ్రదాడితో భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులను పెంచి పోసిస్తున్న పాకిస్తాన్ కి బుద్ది చెప్పాలని దేశం మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటుంది.. ప్రదాని మోది సైతం ఈసారి వెనక్కి తగ్గేది లేదని చెప్పేశాడు.. ఇందులో బాగంగానే ఈ ఘటనకు పాల్పడిన ఉగ్ర సంస్థకు ఎలా బుద్ది చెప్పాలి.. తదుపరి చర్యలు ఏంటి ? అని చర్చించడానికి మోధి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.
మరికాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అనేక మంది గాయాలపాలయ్యారు. మృతి చెందినవారి మృతదేహాలను ఇప్పటికే ఆ ఆ రాష్ట్రాలకు పంపించింది కేంద్రం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో NDA ప్రభుత్వం మొదటిసారి ఇలాంటి సమావేశం జరగడం ఆసక్తి సంతరించుకుంది. దేశరక్షణ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది అని కాంగ్రెస్ అంధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించాడు.. ఈ అఖిలపక్ష సమావేశానికి రాహుల్ కూడా హాజరుకానున్నారు.