Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు పబ్జీ బ్యాన్ పై స్పందించిన చైనా

పబ్జీ బ్యాన్ పై స్పందించిన చైనా

pubg mobile 1597328882

సరిహద్దుల వెంబడి రెచ్చిపోతున్న చైనాపై భారత్ మరోసారి కొరడా జులిపించింది. గతంలో 59 యాప్స్ ను బ్యాన్ చేసిన భారత్ డిజిటల్ స్ట్రైక్ 2.0లో భాగంగా మరో 118 చైనా యాప్‌లను‌ నిషేధించింది. మొదటి స్ట్రైక్ లో టిక్ టాక్, హలో వంటి పేరుగాంచిన అప్లికేషన్లు ఉండగా రెండో స్ట్రైక్ లో పబ్జీ మరియు ప్యార్లర్ స్పేస్ వంటి కీలకమైన అప్లికేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా చైనా కంపెనీలకు ప్రతి ఏడాది కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుంది. ఇప్పుడు ఈ స్ట్రైక్ తో చైనా ఉక్కిరిబిక్కిరియ్యింది. తాజాగా పబ్జీ ఈ విషయంపై స్పందించిన చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్లికేషన్లు నిషేధం ద్వారా భారత్ చైనా ఇన్వెస్టర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను ఉల్లంఘించిందంటు ఆరోపణలు గుప్పించింది.

భారత్ పబ్జీ యాప్ ను బ్యాన్ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో ఫెంగ్‌ అన్నారు. మరోవైపు కేంద్రం పబ్జీ పై బ్యాన్ విధించినప్పటికీ డెస్క్ టాప్ వెర్షన్ మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకంటే భారత్ కేవలం మొబైల్ అప్లికేషన్ ను మాత్రమే బ్యాన్ చేసింది డెస్క్ టాప్ వెర్షన్ హక్కులు మాత్రం దక్షిణకొరియా సంస్థ వద్దే ఉన్నాయి. అందుకే ఇంకా నిషేధం కాలేదని తెలుస్తోంది. భారత్ ద్వారా పబ్జీకి ప్రతియేడాది 200 కోట్లకు పైగా లాభాలను అర్జిస్తుంది. నిషేధిత మొబైల్‌ యాప్‌ల జాబితాలో బైడు, బైడు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, అలీపే, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, విచాట్‌ రీడింగ్‌, క్యామ్‌కార్డ్‌ సహా పలు యాప్‌లున్నాయి. తాజా నిషేధంతో భారత్‌ నిషేధించిన చైనా యాప్‌ల సంఖ్య 224కు పెరిగింది.

తాజాగా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తన యాప్ స్టోర్‌ నుంచి ఏకంగా 29,800 చైనీస్ యాప్స్‌ను తొలగించింది. వీటిల్లో 26 వేలకు పైగా యాప్స్ గేమ్స్‌కు చెందినవి కావడం విశేషం. మరోవైపు చైనా వస్తువులను కూడా బ్యాన్ చేసే దిశగా భారత అడుగులు వేస్తోంది. గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు అమరవీరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుండి మోడీ సర్కార్ యాంటీ చైనా సెంటిమెంట్ ను అందుకుంది. డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ తో చైనా దాదాపు లక్ష కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో చైనా సంస్థలు భారీ ఒడిదుడుకులను ఎదుర్కొక తప్పేటట్లు లేదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad