తమకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదంటూ తిరుపతిలో నటుడు, వ్యాపారవేత్త “మోహన్ బాబు” తన కుమారులతో కలసి చేపట్టిన నిరసన కార్యక్రమం APలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. TDP ప్రభుత్వం చేసిన తప్పును బయటపెట్టి, వారిమేడలు వంచి విధ్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు రాబట్టుకోవాలని మోహన్ బాబు చూస్తే.. నువ్వేమైనా తక్కువా ఇదిగో నీ తప్పులు.. ఇంత మందిని మోసం చేశావు, నీ విద్యాసంస్థలో చదివిన పెద పిల్లాడి సర్టిపికెట్స్ తిరిగి ఇవ్వడానికి 2 లక్షలు తీసుకున్నావ్.
ఇదేకాక నిన్నటి నుండి ప్రభుత్వానికి వందల ఫోన్ కాల్ వస్తున్నాయ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ “మోహన్ బాబు” మమ్మల్ని నిలువునా ముంచాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాబట్టి నీపై ఎంక్వయిరీ వేయడానికి ఆదేశాలు జారీచేసాము అంటూ AP ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు “కుటుంబరావు” రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి మరి మోహన్ బాబుకు వార్నింగ్ ఇచ్చాడు. దాంతో సోషల్ మీడియా ట్వీట్టర్ ద్వారా స్పందించారు మోహన్ బాబు.
అందుకోసం ఒక పెద్ద లెటర్ నే రిలీజ్ చేశాడు.. కక్ష్య సాధింపు మొదలు పెట్టాడు ద గ్రేట్ అబద్దల కోరు. ఆయన గురించి చెప్పాలి అంటే ఒక చరిత్ర, ఒక పుస్తకం, ఒక గ్రంథం. మొదటి నుండి ఈ నాటి వరకు ఏమి చేశాడో నేర పురాణ గ్రంథం చాలా మందికి తెలియని విషయం అంటూ ప్రారంబించిన మోహన్ బాబు.. ఈ కుట్ర వెనక ఉన్నది చంద్రబాబు నాయుడే అని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు.. పైగా నాకు, నా విద్య సంస్థలకు ఏం జరిగిన అతడే కారణం అంటూ చంద్రబాబును ఉద్ధేశిస్తు అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.. ఆయన రాసిన ఆ లెటర్ ని మీరే చదవండి.