Home రాజకీయాలు వైసీపీలోకి నటుడు అలీ.. డేట్ ఫిక్స్‌..!

వైసీపీలోకి నటుడు అలీ.. డేట్ ఫిక్స్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి ఇటీవ‌ల కాలంలో సినిమా పరిశ్రమ నుంచి చేరిక‌లు పెరుగుతున్నాయి.వారిలో ప్ర‌ముఖ న‌టుల‌తోపాటు, క‌మెడియ‌న్‌లు, హీరోలు సైతం ఉన్నారు. పోసాని కృష్ణమురళీ, పృథ్వీరాజ్‌, కృష్ణుడు, భాను చంద‌ర్‌, చోటా కే నాయుడు, ఫిష్ వెంక‌ట్‌, భాను చంద‌ర్ ఇలా చాలా మంది వైసీపీలో కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ త‌రుపున ప్రచారం చేస్తున్నారు.

ఇప్పుడు అదే కోవ‌లో మ‌రో స్టార్ క‌మెడియ‌న్ క‌మ్ హీరో అలీ కూడా వైస్సార్ కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. అయితే, ఈ నెల 9వ తేదీన ఇచ్చాపురంలో వైస్ జగన్ పాదయాత్ర ముగియనుండ‌గా, ఆ క్ర‌మంలో ఏర్పాటు చేయ‌నున్న బహిరంగ సభలో అలీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. ఈ విష‌యం అధికారికంగా నిర్ధార‌ణ అయింది.

అయితే, నటుడు అలీ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో రాజమండ్రి నుంచి పోటీ చేస్తారా..? లేక మ‌రెక్క‌డి నుంచైనా పోటీ చేస్తారా..? అనేది ఇంకా తెలియ‌రాలేదు. పార్టీ ఆదేశాల మేర‌కు త‌న‌ను ఎక్కడినుంచి పోటీ చేయమన్నా..లేకపోతే పార్టీ త‌రుపున ఎన్నిక‌ల ప్రచారం చేయ‌మ‌ని చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇది వ‌ర‌కే అలీ చెప్పారు.

మొత్తంగా చూస్తే వైసీపీకి తూర్పు గోదావరి జిల్లాలో కొద్దిగా బలమైన వ్యక్తులు కావాల్సిన నేప‌థ్యంలో ఇటు సినీనటులతో పాటు ప్రజల ఆకర్షణ ఉన్నటువంటి వారిని ఎన్నిక‌ల‌ బరిలోకి దింపాలిని ఆలోచిస్తున్న నేపథ్యంలో అలీ వైసీపీలో చేరడం పార్టీకి కొంతమేర‌ ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad