పాకిస్థాన్ మరో కొత్త నాటకానికి తెరతీసింది. భారత్ తో చర్చలకు, అభినందన్ విడుదలకు కూడా పాక్ లింక్ పెడుతుంది. వింగ్ కమాండర్ అభినందన్ విడుదల విషయంలో పాకిస్థాన్ కొత్త నాటకానికి తెరతీసింది. ఉగ్రవాదుల పై చర్యలు తీసుకోకుండా చర్చించాలంటూ మైడ్ గేమ్ ఆడుతున్న పాక్ పాలకులు అభినందన్ విడుదలకు, చర్చలకు లింక్ పెడుతున్నారు.
భారత్ తమ దేశంతో చర్చిలకు సిద్ధం అయితేనే అభినందన్ విడుదల చేస్తామని షరతులు పెడుతున్నాయి. అయితే ఈ విషయంలో పాక్ వైఖరిని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. జెనీవా ఒప్పందాని గౌరవించి యుద్ధ ఖైదీగా ఉన్న అభినందన్ ను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తుంది. పాకిస్థాన్ చేతిలో యుద్ధ ఖైదీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ ను విడిపించేందుకు భారత దౌతి యుద్ధం మొదలుపెట్టింది. అభినందన్ తక్షణమే విడుదల చేయాలని ఇప్పటీకే విదేశాంగ శాఖ పాక్ కు లేఖ కూడా రాసింది. భారత విదేశాంగ శాఖ అధికారికంగా పాకిస్తాన్ కు లేఖ పంపింది. అయితే దీనిపై పాక్ నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదు.