Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు మూడో ప్రపంచ యుద్ధం:రానుందా!

మూడో ప్రపంచ యుద్ధం:రానుందా!

india japan aus us agencies

అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా దేశాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కరోనా విజృంభణ తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భారీ ప్రాణ నష్టం జరిగింది. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర దేశం కూడా ప్రాణ నష్టంతో విలవిలలాడుతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం చైనానే అని మెజారిటీ దేశాలు అనుకుంటున్నాయి. మరోవైపు ఆసియాలో చైనా పెత్తనం రోజు రోజుకి పెరుగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో ఇండోనేషియా వంటి దీపాల పై చైనా  ఉక్కుపాదం మోపుతోంది. విస్తరణ వాదంతో రగిలిపోతున్న చైనా తనకు అడ్డు వచ్చిన దేశాల సరిహద్దులను చెరిపి వేసి భూభాగాలను ఆక్రమించుకుంటు వస్తుంది.

పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో చైనాను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం. అందుకే  ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా నూతన కూటమి ఏర్పడిందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చైనా ఆధిపత్యాన్ని ఢీ కొట్టేందుకు భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ దేశాల సమన్వయం కోసం జపాన్‌కు చెందిన హిరోషి కాజియామా, భారత్‌ తరపున పీయూష్‌ గోయల్‌, ఆస్ట్రేలియా తరపున సైమన్‌ బిర్మంగమ్ మంగళవారం వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు. అనధికార సమాచారం ప్రకారం ఈ కూటమిలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉండనుందని సమాచారం. ఇప్పటికే అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, క్వాడ్రిలాటరల్‌ భద్రతా ఒప్పందంలో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఈ కూటమిలో మరికొన్ని దేశాలు చేరనున్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. చైనాను ఢీ కొట్టేందుకు ఈ దేశాలన్నీ కలిసి పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఆర్ధిక మూలాలైన వాణిజ్యం మరియు ఫార్మా ఉత్పత్తులపై కోలుకోలేని దెబ్బ తీయాలని ఈ త్రిముఖ దేశాలు యోచిస్తున్నాయి. మరోవైపు చైనా, రష్యా, ఇరాన్ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అంతర్జాతీయ సమీకరణాలు చూస్తున్నట్లయితే రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad