Home రాజకీయాలు పండగలకు 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణి : టీడీపీ మేనిఫెస్టో విడుదల

పండగలకు 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణి : టీడీపీ మేనిఫెస్టో విడుదల

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి “YSR కాంగ్రెస్ పార్టీ” ఈ ఉదయమే తమ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే.. YCP విడుదల చేసిన కొన్ని గంటల వ్యవదిలోనే తెలుగుదేశం పార్టీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. TDP అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముందుగా దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు అక్కడ మేనిఫెస్టోకు పూజలు చేయించాడు. అనంతరం ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని.. ఆ తరువాత తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. బాబు స్వయంగా తయారుచేయించిన ఈ మేనిఫెస్టోకు “మీ భవిష్యత్తు.. నా బాధ్యత” నామకరణం చేశారు.

తెలుగుదేశం పార్టీ విడుదలచేసిన మేనిఫెస్టోను ఒక్కసారి పరిశీలిస్తే..

*  రైతులందరికీ ఉచితంగా పంటల బీమా

* అన్నదాతా సుఖీభవ పథకం ఐదేళ్లు పూర్తిగా అమలు చేస్తాం

* రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం

* రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా

* రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.

* రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చర్యలు

* గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి రాయితీలు

* రైతులకు లాభసాటి ధరలు లభించేలా వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థల బలోపేతం

* ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్ల సరఫరాకు ప్రత్యేక చర్యలు.

* కేంద్రంతో పోరాడి వ్యవసాయంతో నరేగా అనుసంధానం

* ఆదివాసుల కోసం ప్రత్యేక బ్యాంక్‌ తీసుకొస్తాం.

* సముద్రంలో వేటకు వెళ్లేవారికి క్రాప్‌ హాలిడే కింద రూ.10 వేలు

* చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

* పెళ్లి కానుక రూ.1 లక్షకు పెంపు

* 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరింపు

* మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్పింక్లర్‌  వ్యవస్థల ఏర్పాటు

* కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు

* యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తాం.

* నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతాం. ఇంటర్‌ పాసైతే చాలు నిరుద్యోగ భృతి ఇస్తాం.

* ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌లు ఇస్తాం.

* 20 వేల జనాభా దాటిన మేజర్‌ పంచాయతీలన్నింటిలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు

* పేద కుటుంబాలకు పండుగల నాడు ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు

* చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా ఉచితం. మార్కెటింగ్‌ నిధి రూ.250 కోట్లు ప్రకటిస్తాం. రెడిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటు. సెంటర్‌ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మంగళగిరిలో ఏర్పాటు చేసి శిక్షణ.

* కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ ఇచ్చాం. విదేశీ విద్యకు రూ.25 లక్షలు ఇస్తాం. అన్ని విధాలా కాపుల్లోని పేదలను ఆదుకొనేందుకు అండగా ఉంటాం.

* అన్ని అగ్ర కులాల్లోని పేదలకు న్యాయం చేస్తాం.

* ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పదేళ్లు కొనసాగింపు. రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు. కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ విదేశీ విద్య కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం.

* ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేస్తాం.

* మాదిగ, రెల్లిలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు

* రూ.10 వేల కోట్లతో బీసీల కోసం ప్రత్యేక బ్యాంకు. బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత

* ఏపీఐఐసీ ప్లాట్లలో 25 శాతం బీసీలకు రిజర్వేషన్‌

* స్వయం ఉపాధిలో భాగంగా ఇన్నోవా వంటి కార్ల కొనుగోలుకు 25 శాతం రాయితీ.

* 200 రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటు.

* వృద్ధాప్య పింఛన్‌దారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు

*చంద్రన్న బీమా రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు

* ప్రతి కుటుంబానికి రూ.20వేలు ఆదాయం కల్పించేలా చర్యలు

* డ్వాక్రా మహిళలకు పసుపు – కుంకుమ పథకం కొనసాగింపు, ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు

* మహిళా ఉద్యోగినులకు ద్విచక్రవాహనాల కొనుగోలుకు రాయితీలు

* చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి

* ఆంధ్రప్రదేశ్ ని పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

* రాష్ట్రంలో 15,358 అంగన్వాడీకేంద్రాలకు సొంత భవనాలు నిర్మాణం. ప్రీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం

* గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు హోమ్‌ ఫర్‌ ప్రేగ్నస్ట్‌ ఉమెన్‌ ఏర్పాటు

* బీసీల్లో చేపల వేటకు వెళ్లే వారిలో క్రాప్‌ హాలిడే కింద రూ.10కు పెంపు. డీజిల్‌ ప్రోత్సాహకం రూ.10కి పెంపు.

* వర్గీకరణలో పెండింగ్‌లో ఉన్న కులాలకు న్యాయం జరిగేలా చూస్తాం.

* రాజకీయ ప్రాతినిథ్యం లేని వడ్డెర, బ్రాహ్మణ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తాం.

Read Also: నా అసలు విజన్ ఇదే : కీలక ప్రకటన చేసిన జగన్

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad