Home రాజకీయాలు ఏపి వార్తలు విశాఖ‌లో మ‌రో ప్ర‌మాదం...చేప‌ల బోటులో మంట‌లు

విశాఖ‌లో మ‌రో ప్ర‌మాదం…చేప‌ల బోటులో మంట‌లు

vishakha boat thumb

విశాఖను వ‌రుస ప్ర‌మాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం జరిగింది. ఓ చేపలబోటుకు మంటలు అంటుకున్నాయి. సముద్రంలో ఉండగానే బోటుకు మంటలు అంటుకోవడంతో….. ఆ బోటు తగలబడింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో …..ఐదుగురు మత్స్యకారులు ఉన్నట్టు తెలిసింది. వారు వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే వారిలో ఒక‌రిద్ద‌రికి కొద్దిపాటి గాయాలు కూడా అయినట్టు సమాచారం. హార్బర్‌లో ఓ బోటు ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు చేపల వేటకు వెళ్లింది.

చేపల వేట తర్వాత తిరిగి వస్తున్న సమయంలో….. బోటులో ఉన్న వారు పట్టిన చేపలను రకాలు, సైజుల వారీగా వేరు చేస్తున్నారు . ఈ సమయంలో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. బోటులో మంటలను చూసిన ఇతర బోట్ల వారు వెంటనే అక్కడకు వెళ్లి….. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అలాగే, పోర్టు అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ బోటులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. అదృష్టవశాత్తూ అవి పేలలేదని…… లేకపోతే మరింత ఘోరం జరిగేదని భావిస్తున్నారు. బోటు ఇంజిన్, క్యాబిన్ దగ్ధమైంది. సుమారు రూ.30 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏంటి, ఎంత నష్టం వాటిల్లిందనే అంశంపై…..అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad