Home రాజకీయాలు మైక్రోసాఫ్ట్ చేతికి టిక్ టాక్ ! ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారు ?

మైక్రోసాఫ్ట్ చేతికి టిక్ టాక్ ! ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారు ?

Trump tiktok

చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షార్ట్ వీడియో షేరింగ్ లో ఈ యాప్ ఇప్పటికి నెంబర్ వన్ స్థానంలో ఉంది. టిక్ టాక్ మాతృక సంస్థ బైట్‌డ్యాన్స్‌ తమ వినియోగదారుల డేటాను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానికి చేరవేస్తుందనే ఆరోపనులు రావడంతో భారత్ మరియు ఇండోనేసియా ఈ అప్లికేషన్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసింది. ఆప్పటి నుండి టిక్ టాక్ పై అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఈ అప్లికేషన్ ను పూర్తిగా బ్యాన్ చేస్తామని అనేక సార్లు చెప్పారు. ఇప్పటికే టిక్ టాక్ భారీగా నష్టపోయింది. దీనితో తప్పులను సరిదిద్దే పనిలో పడింది. ట్రంప్ చేప్పినట్టుగా అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ అయితే భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే టిక్ టాక్ తమ నిర్వహణను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కు అందించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ దీనిపై అధికారిక ప్రకటన చేశారు ” చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నాం” అని అన్నారు.

యాప్‌ భద్రతపై వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ సీఈవో సత్యనాదేళ్ల ఆదివారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చించారు. యాప్‌ పనితీరు విషయంలో ట్రంప్‌ లేవనెత్తిన ఆందోళనలపై విస్తృతంగా చర్చించినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ యాప్‌ కార్యకలాపాల్ని సొంతం చేసుకునేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బైట్‌డ్యాన్స్‌తో జరుపుతున్న బ్యాన్ చర్చలు సెప్టెంబరు 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ట్రంప్ లేవనెత్తిన అంశాలకు సరైన పరిష్కారం లభించే విధంగానే కొనుగోలు ఒప్పందం ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సైతం ప్రయోజనాలు అందేలా ఒప్పందం ఉంటుందని హామీ ఇచ్చింది.

మైనారిటీ వాటాల కోసం ఈ ఒప్పందంలోకి ఇతర సంస్థలను సైతం ఆహ్వాస్తామని తెలిపింది. దీనిపై వైట్‌హౌస్‌ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ మైక్రోసాఫ్ట్‌ టిక్ టాక్ ను కొనుగోలు చేసినట్లయితే బ్యాన్ పడకపోవచ్చు. ట్రంప్ కు మైక్రోసాఫ్ట్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో బ్యాన్ అంశం వాయిదా పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad