
బ్రాండెడ్ దుస్తుల కోసం చాలా మంది పోటీపడుతారు. బ్రాండ్ కంపెనీని బట్టి కొనేస్తుంటారు. ఎంత రేటు ఉన్నా సరే తమకు నచ్చిన బ్రాండ్ అయితే చాలు సొంతం చేసుకుంటారు. అయితే వీటిని ఎక్కువుగా హై ప్రొఫైల్ పీపులే కొనేందుకు మొగ్గు చూపుతుంటారు. సామాన్య , మధ్యతరగతి జనం పెద్దగా వెళ్లారు. లాక్ డౌన్ ముందు వరకు ఈ బ్రాండెడ్ కంపెనీల వ్యాపారం ఆరు పువ్వులు, మూడు కాయలుగా ఉండేది. కానీ లాక్ డౌన్ తర్వాత సీన్ మారిపోయింది.
పిక్సడ్ రేటు కంటే పైసా తక్కవుగా కూడా సింగిల్ పీస్ అమ్మవని చెప్పే బ్రాండెడ్ కంపెనీలు …..ఇప్పుడు డిస్కౌంట్ డిస్కౌంట్ అంటూ బోర్డులు పెట్టేస్తున్నాయి. అది కూడా పదో 20 శాతం కాదు..ఏకంగా 70 , 80 శాతం బోర్డులు పెట్టేస్తున్నారు. అవును…ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీలు…… ఇప్పుడు ఆఫర్లు బాట పట్టాయి. అడిడాస్, నైక్, ఉడ్ ల్యాండ్ లాంటి వాటిల్లో షూస్ కొనాలంటే చాలా డబ్బు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆఫర్లు వెల్కమ్ చెబుతున్నాయి.
50 నుంచి 70 శాతం డిస్కౌంట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వ్రంగ్లర్, స్పైకర్ ,లివీస్, కా్లవిన్ క్లెన్ , లూయిస్ ఫిలిప్సైస్ లాంటి కంపెనీల్లోనూ….. భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు కన్పిస్తున్నాయి. బ్రాండ్ పేరు మీద అమ్మాల్సిన వస్తువులు…… ఇప్పుడు ఆఫర్లు, డిస్కౌంట్లలో ఉండాల్సి వచ్చింది. నిజానికి బ్రాండెడ్ కంపెలు ఎప్పడూ ప్రచారం చేసుకోవు. ఫెస్టివ్ ఆపర్స్, న్యూకలెక్షన్స్, సీజన్డ్ కలెక్షన్స్ అని ఇలా రకరకాలుగా పెట్టేస్తుంటాయి. బ్రాండ్‌ను బట్టి వస్త్ర ప్రియులు కొనేస్తుంటారు. కానీ కోవిడ్ దెబ్బకు ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక ఎలాగొలాగ అమ్మేయాలని పోటీపడి మరీ ఆఫర్లు ప్రకటించేస్తున్నాయి. నాలుగు నెలలుగా పెళ్లిళ్లు, పంక్షన్లు లేవు. ఎలాంటి కార్యక్రమం లేదు. ఇక ముందు పెళ్లిళ్లు జరిగే పరిస్థతి కూడా లేదు. దీంతో ఉన్న మ్యాటీరియల్ ను ఎలాగొలాగోలా అమ్మేద్దామని చూస్తున్నాం. అందుకోసమే బ్రాండెడ్ షోరూమ్‌ల ఎంట్రన్స్ వద్ద పెద్ద పెద్ద అక్షరాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి గతంలో పది వేలు పెడితే ఒక బ్రాండెడ్ షర్ట్ ఫ్యాంట్ వచ్చేదేమో. కానీ ఇప్పుడు రెండు వచ్చేలా ఉన్నాయి.
యువత బాగా ఇష్టపడే యూఎస్ పోలో షర్ట్స్ పై 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. బ్రాండెడ్ స్పోర్ట్స్ షూస్ పై 40 నుంచి 50 డిస్కౌంట్ ప్రకటించేశారు. అయినా కూడా కొనేందుకు ముందుకు రావడం లేదు . కరోనా దెబ్బకు ఇంటికి పరిమతమైన జనం…..ఆన్ లైన్లనే షాపింగ్ చేసేస్తున్నారు. బయటకు వెళ్లి షాపింగ్ చేయడం కంటే..ఆన్ లైన్లోనే కానిచ్చేస్తా బెటర్ అని ఫీలవుతున్నారు. ఆన్ లైన్ లోనూ అదే ఆఫర్లు ఉండటంతో…బయటకు వెళ్లి కరో్నా తో ముప్పు తెచ్చుకోవడానికి బదులు…ఇంట్లో ఉండే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో జనంతో కళకళ లాడే బ్రాండెడ్ షోరూమ్స్ అన్ని….. ఇప్పుడు బోసి పోతున్నాయి.
కొనుగోళ్లు లేక నష్టాల బాటపడుతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో వస్త్ర ప్రియులు షాపింగ్ జోలికి వెళ్లడం లేదు. సామాన్య మధ్యతరగతి జనం ఏదో రకంగా బయటకు వస్తున్నా ……బడాబాబులు గడప దాటడం లేదు. బ్రాండెడ్ కంపెనీలకు ఎక్కువుగా ధనికులే కస్టమర్లు. వాళ్లు కూడా రాకపోవడంతో …..ఏమీ చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాయి.