Home రాజకీయాలు బాబోయ్ దెయ్యం చేప‌లు...ఆక్వారైతుల నెత్తిన‌పై బండ

బాబోయ్ దెయ్యం చేప‌లు…ఆక్వారైతుల నెత్తిన‌పై బండ

hypostomus 2

మ‌నం దెయ్యాలు గురించి విన్నాం. వాటి పేరు ఎత్తితేనే చాలా మంది భ‌యంతో వ‌ణికిపోతుంటారు. కొంద‌రేమో అలాంటివేమీ ఉండ‌వని కొట్టిపారేస్తుంటారు. దెయ్యాల వ‌రకు ఓకే మ‌రి దెయ్యాల చేప‌ల గురించి విన్నారా…..వింటానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా…ఇది నిజ‌మే. అలాంటి చేప‌లున్నాయట‌. వాటిని స‌క్క‌ర్ చేప‌లు అని పిలుస్తుంటారు. వాడుక భాష‌లో మాత్రం దెయ్యం చేప‌లంటారు. ప్ర‌స్తుతం ఇవి తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆక్వా రైతుల కొంప ముంచుతున్నాయి. చేప పిల్ల‌ల కోసం వేసిన మేత‌ను మింగేస్తూ తీవ్ర న‌ష్టాల‌ను మిగుల్చుతున్నాయి. అస‌లు ఈ త‌ర‌హా చేప‌లు ఎలా చెరువుల్లోకి వ‌స్తున్నాయో అర్ధం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

దెయ్యం చేప‌ల వ‌ల్ల ఉభ‌య గోదావ‌రి జిల్లాలోని చేప‌ల రైతులు ఆందోళ‌న‌ వ్య‌క్తం చేస్తున్నారు. తిన‌డానికి ప‌నికి రాని చేప‌…కాలువ‌ల ద్వారా, వాటి నుంచి న‌దులు అలా ప‌లు మార్గాల ద్వారా చెరువుల్లోకి వ‌స్తున్నాయి. దీంతో చెరువుల్లో చేప పిల్ల‌ల ఎదుగుద‌ల కోసం వేసిన మేత మొత్తాన్ని తినేస్తున్నాయి. నీటి అడుగున బుర‌ద‌లో దాగి వ‌ల‌ల‌కు చిక్క‌కుండా …..రైతుల‌ను దొంగ‌దెబ్బ తీస్తున్నాయి. అక్వా రైతుల ఆదాయానికి గండి కొడుతున్నాయి. స‌క్క‌ర్ చేప హోమ్నిఓర‌స్ జాతికి చెందిన‌దిగా గుర్తించారు. దీని శాస్త్రీయ నామం హైపోస్తోమ‌స్, క్లిప్తోస్తోమ‌స్‌. నార్త్ అమెరికాలో వీటిని అక్వారియ‌మ్స్‌లో పెంచుతారు. అయితే ఉద్యోగుల బ‌దిలీల స‌మ‌యంలో….. అక్వారియ‌మ్స్ తీసిన‌ప్పుడు ఈ చేప‌ల‌ను బ‌య‌ట ప‌డేశారు. దీంతో అవి కాల్వ‌ల్లోకి చేరి త‌మ సంత‌తిని వృద్ధి చేసుకుంటున్నాయి. నదుల్లోకి, పంట కాల్వ‌ల్లోకి చేరి ……ఆ త‌ర్వాత చెరువుల్లోకి చేర‌డంతో ఆక్వా రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. స‌క్క‌ర్ జాతి చేప‌ల వ‌ల్ల చెరువుల్లో పెంచుతున్న చేప‌లు ఆశించిన ప‌రిమాణంలో పెర‌గ‌డం లేద‌ని అంటున్నారు . ఐదు అంగులాల పెర‌గాల్సిన చేప పిల్ల‌….రెండు అంగుళాలకే ఆగిపోతుంద‌ని వాపోతున్నారు. దానికి కార‌ణం చేప పిల్ల‌ల కోసం వేసిన మేత‌ను దెయ్యం చేప‌లు తిన‌డ‌మేన‌ని చెబుతున్నారు. అస‌లు ఇవి గుడ్లు ద్వారా వ‌స్తుందా లేదా కాకుల ద్వారా వ‌స్తుందా కూడా అర్ధం కావ‌డం లేద‌ని చెబుతున్నారు. వీటిని నాశ‌నం చేయాలంటే చెరువు మొత్తాన్ని ఎండ‌పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు. అలా చేస్తే తాము మ‌రింత న‌ష్ట‌పోతామ‌ని బాధ‌ప‌డుతున్నారు. స‌క్క‌ర్ చేప‌లు అదే దెయ్యం చేప‌లు చూడ‌టానికి భ‌యంక‌రంగానే ఉంటాయి. ఒంటి నిండా మ‌చ్చ‌లు, త‌ల‌పై భాగంలో క‌ళ్లు, పళ్లు చాలా ప‌దునుగా ఉంటాయి. దీంతో వీటిని నాశ‌నం చేసే మందును ఇంకా క‌నిపెట్ట‌లేద‌ని మ‌త్య్స‌శాఖ అధికారులు అంటున్నారు. ఇవి చెరువులోకి ప్ర‌వేశించ‌కుండా మోటార్ల‌కు మెస్ అమ‌ర్చాల‌ని…దీని వ‌ల్ల ఈ దెయ్యం చేప పిల్ల‌లు నీటిలోకి చేర‌వ‌ని అధికారులు చెబుతున్నారు. వీటిని నిర్మూలించాలంటే చెరువ‌కు నీళ్లు పెట్టే స‌మ‌యంలోనే …త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటే స‌రిపోతుంద‌ని సూచిస్తారు. అంత‌కంటే వేరే దారి లేద‌ని చెబుతున్నారు. ఏదీఏమైనా దెయ్యం చేప‌ల‌తో ఉభ‌య‌గోదావ‌రి జిల్లా ఆక్వా రైతులు బేజార్ అయిపోతున్నారు. ఏదైనా ప‌రిష్కార మార్గం చెప్పాల‌ని కోరుతున్నారు. లేదంటే తాము ఆక్వా క‌ల్చ‌ర్ చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంద‌ని వాపోతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad