Home రాజకీయాలు పెళ్ళైన రెండో రోజే ఆత్మహత్య!

పెళ్ళైన రెండో రోజే ఆత్మహత్య!

Ramya Sri tiktoker death

కాళ్ల పారాణి ఆర‌లేదు. క‌ట్టిన తోరణాలు ఎండ‌లేదు. ఇంత‌లోనే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న క‌న్న బిడ్డ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

తూర్పుగోదావ‌రి జిల్లా ఈడిద సీతాన‌గ‌రంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మహ‌దాసు శీను, మంగ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద‌కుమార్తె పేరు ర‌మ్య‌శ్రీదేవి. రాజ‌మండ్రిలోని ఒక కాలేజీలో డిగ్రీ చేసింది. చాలా తెలివైనా అమ్మాయి. ఏ సినిమా పాట అయినా, డైలాగ్ అయినా వెంట‌నే ప‌ట్టేస్తుంది. ఆమె చేసిన టిక్ టాక్ వీడియోలు కూడా…. రాజ‌మండ్రిలో చాలా ఫేమ‌స్. వ‌రుస‌కు అన్న అయిన వ్య‌క్తితో క‌లిసి షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. ప్ర‌తీ ఏడాది అత‌ను ఎక్క‌డుంటే అక్క‌డికి వెళ్లి మ‌రీ రాఖీ క‌ట్టేది. అన్నీ స‌వ్యంగా ఉంటే..ఆమె తీసిన షార్ట్ ఫిల్మ్ ఆగ‌స్టు 2వ తేదీన రిలీజ్ అయ్యేది.

20 ఏళ్ల ర‌మ్య‌శ్రీదేవికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం మండ‌లం ల‌క్ష్మ‌ణేశ్వ‌రం గ్రామానికి చెందిన త‌న మేన‌మామ‌కు ఇచ్చి పెళ్లి జ‌రిపించారు. ఇంత వ‌ర‌కు అంతా బాగానే ఉంది. పెళ్లికి ముందు కూడా ఆనందంగానే ఉంది. కుదిరిన‌ప్పుడు కూడా యువ‌తి చాలా సంతోషంగానే ఉంది. తాను హిందువు అయినా మేన‌మామ బాప్టిజం తీసుకోవ‌డంతో ….చ‌ర్చిలో పెళ్లి జ‌రిపించారు. ఉద‌యం పెళ్లి జ‌రిగిన వెంట‌నే ….న‌ర‌సాపురంలోని మెట్టినింట్లోకి అడుగుపెట్టింది.

పెళ్లైన రెండో రోజు భ‌ర్త‌తో క‌లిసి పుట్టింటికి వ‌చ్చింది. పుట్టింట్లో ఆడుతూ పాడుతూ, భ‌ర్త‌తో ప‌రాచ‌కాలు ఆడుతూ చాలా సంతోషంగా క‌నిపించింది. ఇంట్లో అన్నీ ప‌నులు తానే చేస్తూ క‌లివిడిగా తిరిగింది. అంత ఉల్లాసంగా క‌నిపించిన ఆ అమ్మాయికి….అంత‌లోనే ఏం క‌ష్టం వ‌చ్చిందో ఏమో కానీ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దుస్తులు ఆర‌వేయ‌డానికి మేడ‌పైకి వెళ్లి …….కూల్ డ్రింక్ లో ఎలుక‌ల మందు క‌లుపుకుని తాగేసింది. మేడ‌పై నుంచి ఎంత‌కీ రాక‌పోవ‌డంతో పైకి వెళ్లి చూసిన‌వారంతా అవాక్క‌య్యారు. స్ప్రుహ త‌ప్పి ప‌డి ఉన్న ర‌మ్య‌శ్రీదేవిని ప్ర‌భుత్వ‌ ఆస్పత్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే ప‌రిస్థితి చేదాటిపోయింది. చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి చ‌నిపోయింది. మేన‌మామ‌తో పెళ్లి ఇష్టం లేక‌నే చ‌నిపోయింద‌ని కొంద‌రు వాదిస్తూ…మ‌రికొంద‌రు మాత్రం అలాంటిదేమీ లేద‌ని చెప్పుకొస్తున్నారు.

శోభ‌నం జ‌రిగిన త‌ర్వాత రెండో రోజు ఎందుకు చ‌నిపోతుంద‌ని వాదిస్తున్నారు. పెళ్లి జ‌రిగిన రెండో రోజే ఆమె చ‌నిపోవ‌డం ఎంత‌కీ అంతుప‌ట్ట‌డం లేదు. మెట్టినింట్లోకి వెళ్లే ముందు రోజే ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం, మ‌రోవైపు ఆమె న‌టించిన షార్ట్ ఫిల్మ్ విడుద‌ల కూడా త‌ర్వాత రోజే ఉండ‌టంతో కార‌ణాలు ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్లే …..ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుందేమోన‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్క‌డే మ‌రికొన్ని అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. పెళ్లికి ముందు ఎన్నో క‌ల‌లు క‌నింది. పెళ్లైన త‌ర్వాత కూడా చ‌దువుకోవాల‌ని అనుకుంది. వ‌రుడు మేన‌మామ కాబ‌ట్టి చ‌దువుకు ఇబ్బంది ఉండ‌దిలే అనుకుంది. చ‌దువు అయిన త‌ర్వాత ఆమె కాకినాడ‌లో ఉద్యోగం కూడా చేసింది. అక్క‌డ ఏదైనా ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచిందా అనే వాద‌న‌లు ఉన్నాయి. కానీ దీన్ని యువ‌తి త‌ల్లిదండ్రులు ఖండిస్తున్నారు. నిజానికి ఉన్న‌త చ‌దువులు చ‌దువుకోవాల‌ని ర‌మ్య‌శ్రీ కోరిక‌. పెళ్లి త‌ర్వాత అది జ‌ర‌గ‌ద‌నే బాధ‌తోనే …..చ‌నిపోయి ఉంటుంద‌ని మృతురాలి బంధువులు అంటున్నారు. కానీ ర‌మ్య‌శ్రీదేవి త‌ల్లిదండ్రులు మాత్రం ఏవిష‌యం చెప్ప‌డం లేదు.

చ‌దువుకునే ఉద్దేశం ఉన్న అమ్మాయి అయితే ఉద్యోగం ఎందుకు చేసిన‌ట్టు…మ‌ధ్య‌లో షార్ట్ పిల్మ్ లో న‌టించేందుకు ఎందుకు వెళ్లిన‌ట్టు….ఇవ‌న్నీ జవాబులు లేని ప్ర‌శ్న‌లుగా మిగిలిపోయాయి. మ‌రోవైపు ఇష్టం లేని పెళ్లి అయితే….. పెళ్లి పీట‌ల‌కు ముందే ఆత్మ‌హ‌త్య‌త్నం య చేసుకునేది క‌దా అనేవాళ్లు ఉన్నారు. పెళ్లైన రెండు రోజుల త‌ర్వాత, భ‌ర్తతో ఏకంతంగా గ‌డిపిన త‌ర్వాత …చ‌నిపోవాల్సిన అవ‌స‌రంమేంటి అనే ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతున్నారు. భ‌ర్త‌ నుంచి ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిందా…లేదా షార్ట్ ఫిల్మ్ స‌మ‌యంలో ఏదైనా రికార్డు చేసి ఎవ‌రైనా బెదిరించారా.. …లేదా కాకినాడ‌లో ఏదైనా ప్రేమ వ్య‌వ‌హారం అనేది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం వీటిని క‌నిపెట్టేందుకు పోలీసులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మృతిరాలి కాల్ డేటాను ప‌రిశీలిస్తున్నారు. ఏదీఏమైనా కూతురి పెళ్లితో ఆనందంలో మునిగితేలుతున్న త‌ల్లిదండ్రుల‌కు…వారి బిడ్డ ఆత్మ‌హ‌త్య షాక్‌కు గురిచేసింది

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad