Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు నిరసన సెగ :లెబనాన్‌ ప్రధాని రాజీనామా

నిరసన సెగ :లెబనాన్‌ ప్రధాని రాజీనామా

Lebonan prime minister

వారం రోజులు క్రితం లెబనాన్‌ రాజధాని బీరుట్ లో జరిగిన భారీ పేలుడు కారణంగా 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోర్ట్‌సైడ్ గిడ్డంగిలో కొన్నాళ్లుగా నిల్వ ఉంచిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా ఈ పేలుడు సంభవించినట్టు ప్రభుత్వం తెలిపింది. దీనితో ఒక్కసారి దేశంలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మెజారిటీ ప్రజలు మరియు మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లెబనాన్‌ ప్రధాని హసన్‌ దియాబ్ తో పాటు ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామాలను లెబనాన్‌ అధ్యక్షుడు మైఖేల్‌ ఔన్‌ ఆమోదించారు. ఈ సందర్భంలో హసన్‌ దియాబ్ మాట్లాడుతూ “ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని, అందుకే నేను రాజీనామా చేసి ప్రజల తరఫున పోరాడతానని” అన్నారు. అయితే దియాబ్ కనుసన్నల్లోనే దేశంలో అవినీతి రాజ్యమేలుతుందని ప్రజలు విమర్శలు గుప్పించారు. ఈ ప్రమాదంలో సుమారు 6 వేల మందికి పైగా గాయపడగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పేలుళ్లతో బీరుట్‌ దీవి వణికిపోయింది. పోర్టు మొత్తం ధ్వంసమైంది. బీరుట్ కు అత్యవసరంగా ఔషధాలు,ఆహార ఆహార పదార్థాలు, నిత్యవసర వస్తువులు పంపిస్తున్నట్టు భారత్ తెలిపింది. ఐరాస భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad