Home రాజకీయాలు జోరు పెంచిన భారత్ బయోటెక్ : అతి తక్కువ ధరకే వ్యాక్సిన్

జోరు పెంచిన భారత్ బయోటెక్ : అతి తక్కువ ధరకే వ్యాక్సిన్

BHARATH BIOTEK THUMB

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే రష్యా ఆగస్టు రెండో వారంలో తమ వ్యాక్సిన్ రాబోతోందని ప్రకటించింది. మరో వైపు ఆక్స్‌ఫర్డ్,మోడెర్నాన్ వంటి సంస్థలు తయారు చేస్తున్న టీకాలు మరికొన్ని నెలలో రాబోతున్నాయి. ఈ సమయంలో భారత్ బయోటెక్ రూపొందిస్తున్న “కొవాగ్జిన్“ మంచి ఫలితాలు రాబట్టుతుంది.

ఇప్పటికే కొవాగ్జిన్ మొదటి దశ ట్రయల్స్ పూర్తి చేసుకొని, రెండవ దశలో అడుగుపెట్టింది.ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం నవంబర్ నాటికి కొవాగ్జిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్ రూపొందిస్తే సరిపోదు అది అట్టడుగు వర్గాలకు, దారిద్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు చేరాలి. అంతర్జాతీయ వ్యాక్సిన్ లు భారత్ కు వచ్చినప్పటికీ ధర భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అందుకే భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ అత్యంత తక్కువ ధరకే తీసుకువస్తామని భారత్ బయోటెక్ సంస్థ ఎండీ డాక్టర్ ఎల్లా కృష్ణ తెలిపారు.

ప్రస్తుతానికి కొవాగ్జిన్ ధర నిర్ణయించినప్పటికీ 50 రూపాయల లోపే ఉండనుందని తెలుస్తోంది. గతంలో భారత్ బయోటెక్ రూపొందించిన రొటా వైరస్ వ్యాక్సిన్ 40 రూపాయలకే అందుబాటులోకి వచ్చి చరిత్ర సృష్టించింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తో కలిసి భారత్ బయోటెక్ రూపొందిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను ఆగష్టు 15 నాటికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. అనుకున్న విధంగా కొవాగ్జిన్ అతి తక్కువ ధరకు వస్తే ప్రపంచంలో సరికొత్త అధ్యాయానికి భారత్ బయోటెక్ తెరలేపినట్టు అవుతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad