Home రాజకీయాలు చైనాకు యాపిల్ భారీ షాక్..29 వేల యాప్స్ బ్యాన్ !

చైనాకు యాపిల్ భారీ షాక్..29 వేల యాప్స్ బ్యాన్ !

PicsArt 08 03 11.54.20

కరోనా కల్లోలానికి ప్రధాన సూత్రధారి అయిన చైనాకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి భారీ షాక్ లను ఇస్తున్నాయి. చైనా కమ్యూనిస్టు పరిపాలన కారణంగా ఆ దేశంలో ఇప్పటికీ మెజారిటీ పరిశ్రమలు విదేశాలకు తరలిపోయాయి. మరోవైపు భారత్ సరిహద్దుల వెంబడి చైనా కయ్యానికి కాలు దువ్వడంతో భారత్ డిజిటల్ స్ట్రైక్ ను చేసింది. జాతీయ భద్రతకు, యూసర్స్ ప్రైవసీకి ముప్పుగా ఉన్న 59 యాప్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రముఖ అప్లికేషన్ అయినా టిక్‌టాక్, హెలో ఉన్నాయి.

తాజాగా భారత్ మరో చైనా 47 యాప్స్‌ని నిషేధించింది. ఇదిలా కొనసాగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ ను బ్యాన్ చేయడానికి సర్వం సిద్దం చేస్తునట్టు తెలుస్తుంది. వరుస షాక్ లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చైనాకు టెక్ దిగ్గజం యాపిల్ మరో షాక్ ను ఇచ్చింది. ఆపిల్ స్టోర్ నుండి దాదాపు 29,800 చైనీస్ యాప్‌లను పూర్తిస్థాయిలో తొలగిస్తూనట్టు ప్రకటించింది. ఇందులో 26వేల గేమ్ అప్లికేషన్స్ ఉన్నాయి.

కిమై రిసెర్చ్ నివేదిక ప్రకారం మొత్తం అప్లికేషన్ ల సంఖ్య దాదాపు 30,000 లోపల ఉండనుందని” తెలియజేసింది. చైనాకు చెందిన 26000 అప్లికేషన్లు ఎటువంటి లైసెన్స్‌లు లేకుండా గేమింగ్ ను నిర్వహించడంతో యాపిల్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో లైసెన్సు కు సంబంధించిన అంశం పై ఆపిల్ సంస్థ గేమింగ్ డెవలపర్లకు హెచ్చరికలు జారీ చేసింది. జూన్ చివరి నాటికి ప్రభుత్వం నుంచి పొందిన లైసెన్స్‌లను సమర్పించాలని ఆదేశించింది.అయినప్పటికీ కొన్ని అప్లికేషన్లు యాపిల్ నిబంధనలను తుంగలో తొక్కడంతో ఆపిల్ సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో జైంగా, సూపర్‌సెల్ తదితర గేమింగ్ యాప్స్ ఉన్నాయి. ఈ నిర్ణయంతో చైనా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల సంస్థలన్నీ చైనాపై డిజిటల్ స్ట్రైక్స్ చేస్తూ ఉండడంతో డ్రాగన్ కంట్రీ కక్కలేక మింగలేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అమెరికా లో టిక్ టాక్ బ్యాన్ అయితే చైనా కు కోలుకొని దెబ్బ తగిలే అవకాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad