Home రాజకీయాలు చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్ : ఆ యాప్స్ మాయం

చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్ : ఆ యాప్స్ మాయం

webo baidu

డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ తో చైనాకు భారత్ వరస షాక్ లను ఇస్తూనే ఉంది. ఇప్పటికే 59 చైనా యాప్స్‌ని బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం తాజాగా మరో 47 యాప్స్‌ని నిషేధించింది. సరిహద్దుల వెంబడి రెచ్చిపోతున్న చైనాను కంట్రోల్ చేయడానికి దాని ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టేందుకు భారత్ “డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్”ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సెర్చింజన్‌ అప్లికేషన్ అయినా వీబో, బైడు యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించినట్టు తాజాగా వెలువడిన నివేదికలు ద్వారా వెల్లడవుతోంది.

ఈ రెండు అప్లికేషన్లకు దాదాపు 100 మిలియన్లకు పైగా యూజర్స్ ఉన్నారు. వీబో, బైడు ట్విట్టర్, గూగుల్ సెర్చింజన్‌కు‌ ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తున్నాయి. జూలై 27 న భారత ప్రభుత్వం నిషేధించిన 47 కొత్త యాప్‌లలో వీబో, బైడు సెర్చింజన్‌ కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటితో పాటు చైనాకు చెందిన మరిన్ని యాప్‌లను నిషేధించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోందని వారు వెల్లడించారు. వీటితో పాటు పబ్జీ యాప్‌ను కూడా తొలగించడానికి మోదీ సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తన యాప్ స్టోర్‌ నుంచి ఏకంగా 29,800 చైనీస్ యాప్స్‌ను తొలగించింది. వీటిల్లో 26 వేలకు పైగా యాప్స్ గేమ్స్‌కు చెందినవి కావడం విశేషం.మరోవైపు చైనా వస్తువులను కూడా డాన్స్ చేసే దిశగా భారత అడుగులు వేస్తోంది.గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు అమరవీరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుండి మోడీ సర్కార్ యాంటీ చైనా సెంటిమెంట్ ను అందుకుంది. డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ తో చైనా దాదాపు లక్ష కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో చైనా సంస్థలు భారీ ఒడిదుడుకులను ఎదుర్కొక తప్పేటట్లు లేదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad