Home రాజకీయాలు ఒకే సారి మూడు రికార్డులను బ్రేక్ చేసిన మోదీ!

ఒకే సారి మూడు రికార్డులను బ్రేక్ చేసిన మోదీ!

modi thumb

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామాలయ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనితో హిందువుల కల నిజమైంది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సెట్ చేశారు. అయోధ్యలో ఉన్న అత్యంత పురాతనమైన హనుమాన్‌ ఆలయంలో మొట్టమొదటిసారిగా పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం. ఈ ఆలయం 10 వ శతాబ్దానికి చెందింది. రామ జన్మభూమి అయినా అయోధ్యను సందర్శించి, రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఏకైక ప్రధాని మోదీయే కావడం మరో ఆసక్తికర అంశం. ఒకేసారి అయోధ్య సందర్శన, రామాలయ నిర్మాణానికి స్థాపన, హనుమాన్ ఆలయంలో పూజలతో మూడు రికార్డులను బ్రేక్ చేసి చరిత్రలో నిలిచిపోయారు మోదీ.

రామమందిర శంకుస్థాపన అట్టహాసంగా జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంలో మోదీ కీలక ప్రసంగం చేశారు. అయితే రామాలయ నిర్మాణానికి ప్రధాన కారకుడైన ఎల్‌కే అద్వాణీ పేరెత్తకుండానే అందరు ప్రసంగాన్ని ముగించడం అనేక విమర్శలు తావునిస్తోంది.

రామాలయ నిర్మాణంలో ఎల్‌కే అద్వాణీ కీలకమైన పాత్రలు పోషించారు. 1990లో రామ్ రథయాత్రను ప్రారంభించి యావత్ దేశాన్ని ఒకే తాటిపైకి అటువంటి కురువృద్ధుడుకి ఏ స్థానం లభించకపోవటం బీజేపీ శ్రేణులును ఆశ్చర్యానికి గురి చేసింది. అయోధ్యలో నరేంద్ర మోడీ అడుగుపెట్టి నేటికీ 28 సంవత్సరాలు అవుతుంది. 1992 జనవరి 18న అయోధ్యను సందర్శించిన ఆయన, మరల రామమందిర నిర్మాణం అప్పుడే అయోధ్యలో అడుగుపెడతానని శపథం చేశారు. అనుకున్న విధంగానే తన మాటను నిరూపించుకొని నేడు అయోధ్యలో అడుగుపెట్టారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad