Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఇండియాలో పెట్టుబడులు వరద : మైక్రోసాఫ్ట్ వ్యూహమేంటి ?

ఇండియాలో పెట్టుబడులు వరద : మైక్రోసాఫ్ట్ వ్యూహమేంటి ?

microsoft thumb

టిక్ టాక్ బ్యాన్ తరువాత భారతదేశంలో పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు ఈ లిస్టులో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. తాజా సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ ఇండియాన్ సోషల్ నెట్వర్క్ షేర్‌చాట్‌లో సుమారు 100 మిలియన్ల పెట్టుబడులను పెట్టడం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే షేర్ చాట్ తమ వాటాదారులు మరియు పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న ఈ పెట్టుబడులు అంశం మరికొద్ది నెలల్లో పూర్తికానుందని తెలుస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అమెరికా టిక్‌టాక్ కార్యకలాపాలను బైట్‌డాన్స్ సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే.

దీనితో పాటుగా టిక్‌టాక్ ఇండియా మార్కెట్ మరియు యూరోపియన్ మార్కెట్‌ను సొంతం చేసుకోవటానికి మైక్రోసాఫ్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో టిక్ టాక్ బ్యాన్ కానుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో మైక్రోసాఫ్ట్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల యొక్క టిక్ టాక్ కార్యకలాపాలను తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇండియాలో టిక్ టాక్ పూర్తిగా బ్యాన్ కావడంతో మైక్రోసాఫ్ట్ షేర్‌చాట్‌ పై దృష్టి సారించినట్లు టెక్ సర్కిల్లో వినిపిస్తుంది. ఇండియాలో టిక్ టాక్ కు షేర్‌చాట్‌ బలమైన ప్రత్యర్థి.టిక్ టాక్ ను నిషేధించిన రోజుల వ్యవధిలోనే షేర్‌చాట్ Moj అనే వీడియో షేరింగ్ సర్వీస్ ను ప్రారంభించి సూపర్ సక్సెస్ అయింది.షేర్‌చాట్ లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల ఈ అంశంపై ఇరు సంస్థల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad