Home రాజకీయాలు ఏపి వార్తలు ఇంటికి చేరని రఘురామకృష్ణంరాజు:ఎందుకంత భయం?

ఇంటికి చేరని రఘురామకృష్ణంరాజు:ఎందుకంత భయం?

raghurama krishnamraju 1200x900 1

వైసీపీ పార్టీలో అసంతృప్తి అంటు ఏదైనా ఉందంటే అది కేవలం రఘు రామకృష్ణం రాజు అంశం అయ్యి ఉంటుంది. 151 ఎమ్మెల్యేల భారీ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకున్నా వైకాపా పార్టీకి సొంత ఎంపీ మేకుల తయారవుతాడని మొదట ఎవరు అనుకోని ఉండరు. అయితే పరిస్థితుల ప్రభావం మరియు పార్టీలో అంతర్గత కలహాల కారణంగా రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపైనే ఎదురు బావుటా ఎగురవేశారు. ఏకంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే అధికంగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు రఘురామ కృష్ణంరాజును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

మరోవైపు సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేలు, ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటంతో తనపై దాడి జరిగే అవకాశం ఉందని అందుకే తక్షణం భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీని కోసం ఏకంగా ఢిల్లీకి పయనమయ్యారు. చివరకు కేంద్రం వారికి వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ రఘురామకృష్ణంరాజు సొంత నియోజకవర్గమైన నరసాపురానికి మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దీనికి ప్రధాన కారణం వారిలో ఉన్న భయమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయిలో భద్రత సిబ్బందిని కలిగి ఉన్న ఏకైక ఎంపీ రఘురామకృష్ణంరాజు.

కేంద్రం తాజాగా ప్రకటించిన భద్రతా సిబ్బందితో కలిపి వారికి ఏకంగా 13 మంది సెక్యూరిటీ అధికారులు వారికి రక్షణ కల్పిస్తున్నారు. ఈ స్థాయిలో భద్రత ఉన్నప్పటికీ ఆయన నా సొంత నియోజకవర్గానికి రావడానికి మాత్రం సంశయం వ్యక్తం చేస్తున్నారు. వారు భయపడుతున్నారని అందుకే నియోజకవర్గానికి రాకుండా ఢిల్లీలోనే ఉండిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ప్రతి రోజు ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేటట్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర అధినాయకత్వం వారి పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రఘురామక్రిష్ణం రాజు పంచాయతీ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad