ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు వినోదం పంచడంలో ఓటీటీ వేదికలు ముందుంటున్నాయి. టెక్నాలజీ వాడకం కూడా విస్తృతంగా పెరిగిపోవడంతో వీటికి ఆదరణ పెరిగింది. దీనికి తోడు గతంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ మూసివేయంతో ప్రేక్షకలు ఈ ఓటీటీకి అలవాటు పడ్డారు. దీంతో థియేటర్స్ లో విడుదలైన బడా సినిమాలు సైతం నెల తిరిగేలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈక్రమంలో ఇంట్లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఓటీటీ బెస్ట్ ఫ్లాట్ ఫామ్స్ అయ్యాయి. ఈ క్రమంలో మరి.. ఈ వారంలో ఆన్ లైన్ వేదికలపై సందడి చేయబోయే సినిమాల లిస్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.. జులై మొదటి వారంలో అలరించేందుకు సిద్ధమవుతున్న ఓటీటీ సినిమాలు, సిరీస్ : ధాకడ్- జులై 1 (జీ5), సామ్రాట్ పృథ్వీరాజ్- జులై 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో), అన్యాస్ ట్యుటోరియల్- జులై 1 (ఆహా), ది టెర్మినల్ లిస్ట్- జులై 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో), స్ట్రేంజర్ థింగ్స్ 4 (వెబ్ సిరీస్)- జులై 1 (నెట్ఫ్లిక్స్), షటప్ సోనా (వెబ్ సిరీస్)- జులై 1 (జీ5), మియా బీవీ ఔర్ మర్డర్- జులై 1 (ఎంఎక్స్ ప్లేయర్), ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ 2 (వెబ్ సిరీస్)- జూన్ 28, బ్లాస్టెడ్- జూన్ 28 (నెట్ఫ్లిక్స్), డియర్ విక్రమ్- జున్ 30 (వూట్)