సూయజ్ కాలువకు మరోసారి ఎవర్ ఏస్ షిప్ భయం, కెనాల్ ను దాటుతుందా?

ఇంటర్నేషనల్ డెస్క్- సూయజ్ కాలువ.. ఈ పేరు అంతకు ముందు ఎవ్వరికి పెద్దగా తెలియదు. కానీ ఈ సంవత్సరం మార్చిలో ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా నౌక ఎవర్ గివెన్ ఈ కెనాల్ లో ఇరుక్కుపోవడంతో అందరికి సూయజ్ కాలువు గురించి తెలిసింది. సుమారు ఆరు రోజుల పాటు శ్రమించి సూయజ్ కాలువ నుంచి ఎవర్ గివెన్ నౌకను కాలువ నుంచి పక్కకు కదిలించారు. ఈ నౌక సూయజ్ కెనాల్ లో ఇరుక్కపోవడంతో వందలాది నౌకలు రోజుల తరబడి స్థంబించిపోయాయి.

దీంతో పలు దేశాలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇదిగో ఇప్పుడు మళ్లీ మరో భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటెయినర్ నౌకగా పేరుగాంచిన మరో నౌక ఎవర్ ఏస్ ఇంగ్లండ్ లోని ఫెలిక్స్‌స్టోవ్‌ రేవుకు ఆదివారం తెల్లవారుజామున చేరుకుంది. దీని పొడవు 400 మీటర్లు, సామర్థ్యం 23,992 కంటెయినర్లు. ఇది బుధవారం రోటర్‌ డ్యామ్ బయలుదేరుతుంది. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ అసలు విషయం మాత్రం ఇక్కడే ఉంది.

Ever Given Ship 1

రోటర్ డ్యామ్ చేరుకోవడానికంటే ముందు ఈ భారీ ఎవర్ ఏస్ నౌక సూయజ్ కాలువను దాటాల్సి ఉంటుంది. ఎవర్ ఏస్ రెండు రోజుల పాటు ఫెలిక్స్‌స్టోవ్‌‌లోనే ఉంటుంది. ఆ తర్వాత బుధవారం రోటర్‌ డ్యామ్‌కు బయలుదేరుతుంది. ఈ క్రమంలో అది సూయజ్ కెనాల్‌ను దాటాల్సి ఉంటుంది. దీంతో ఈ సారి ఈ భారీ నౌక సాఫీగా కాలువను దాటుతుందా, లేదంటే ఎవర్ గివెన్ లాగే సూయజ్ కాలువలో చిక్కుకుపోతుందా అన్నది ఆందోళన కలిగిస్తోంది.

ఇక వేరే మార్గంలో ఈ నౌకను తరలించాలనుకున్నా.. అది సాధ్యం కాదట. ఖచ్చింగా సూయజ్ కాలువ ద్వారనే ఈ బారీ నౌక ఎవర్ ఏస్ రోటర్ డ్యామ్ కు చేరుకోవాలి. ప్రపంచ సముద్ర కార్గో వాణిజ్యంలో దాదాపు 12 శాతం ఈ మార్గం నుంచే జరుగుతుంది. అందుకే ఎవర్ ఏస్ నౌక సూయజ్ కాలువను దాటే సమయంలో నిపుణల పర్యవేక్షణ అవసరమని, ఆమేరకు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.