నీ బిడ్డకు తండ్రి ఎవరు..మహిళా ఎంపికి చేదు అనుభవం.. కానీ దిమ్మతిరిగే ఆన్సర్

స్పెషల్ డెస్క్- అందాల నటి, ఎంపీ నుస్రత్ జహాన్ గుర్తుంది కదా. ఆమె అవడానికి బెంగాలీ ముస్లిం అయినప్పటికి, రెండేళ్ల క్రితం 2019లో నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. 2018 నుంచి అతనితో రిలేషన్‌షిప్‌లో ఉన్న నుస్రత్ జహాన్, ఏడాది తరువాత 2019లో అతన్ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పక్కా బెంగాళీ ముస్లిం అయిన నుస్రత్ జహాన్ నుదుటిన బొట్టు పెట్టుని పార్లమెంట్ కు రావడంతో ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.

మరి ఏంజరిగిందో తెలియదు కాని, గత కొన్ని రోజులుగా ఆమె తన భర్తతో దూరంగా ఉంటోంది. వ్యక్తిగతంగా విబేధాలు కారణంగా నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ లు గత సంవత్సరం నవంబర్ నుంచి దూరంగా విడి విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో నుస్రత్ జహాన్ తాజాగా తల్లి అయ్యింది. పదిహేను రోజుల క్రితం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కోల్‌కతాలోని భగీరథీ నియోతియా ఆస్పత్రిలో నుస్రత్ జహాన్ సిజేరియన్ జరిగినట్లు, తల్లీ బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారని ఆమె స్నేహితుడు యష్ దాస్ గుప్తా తెలిపారు.

nusrat 1

తల్లి అయిన సందర్బంగా నుస్రత్ జహాన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పారు. విబేధాల కారణంగా నుస్రత్‌ తో విడిపోయిన ఆమె భర్త నిఖిల్ జైన్‌ కూడా ఈ సందర్బంగా స్పందించారు. తల్లి బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉండాలి.. అని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా నుస్రత్ జహాన్ కు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతాలో ఓ సెలూన్‌ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేసింది.

ఈ క్రమంలో మీ బిడ్డకు తండ్రెవరు అని మీడియా అడిగిన ప్రశ్నకి ధీటుగా సమాధానం చెప్పింది నుస్రత్ జహాన్. బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చంది. నుస్రత్ జహాన్ ఇచ్చిన సమాధానానికి అంతా ప్రశంసిస్తున్నారు. ఆమె ధైర్యం, ముక్కుసూటి తనం, సమయస్పూర్తిని అంతా మెచ్చుకుంటున్నారు. మహిళలకు ఆ మాత్రం దైర్యం అవసరమని కామెంట్స్ చేస్తున్నారు. మరి మనం కూడా నుస్రత్ జహాన్ కు ఆల్ ది బెస్ట్ చెబుదామా.