భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం, కొడుకులతో కలిసి అతి దారుణంగా

కర్ణాటక క్రైం- ఈ మధ్య కాలంలో సమాజంలో వివాహేతర సంబంధంలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్లను కాదని ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాలు చివరికి కుటుంబాలను చిన్నాబిన్నం చేయడంతో పాటు, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నా కూడా, వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా కర్ణాటక రాష్ట్రంలోను ఇలాంటి వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేసిన ఘటన శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ ​26న ఈ హత్య జరిగినా, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన 45 ఏళ్ల వినోద్​ కుమార్ పక్క ఉరికి చెందిన, ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉంది.

Murder 1

ఈ విషయం వినోద్ ​భార్యా పిల్లలకు తెలయడంతో పలు మార్లు వారించారు. వివాహితతో అక్రమ సంబంధాని విరమించికోవాలని బెచ్చరించారు. అయినా వినోద్ మాత్రం వినిపించికోలేదు. ఈ క్రమంలో వినోద్ ఇటీవల తమ వ్యవాయ భూమి అమ్మాగా వచ్చిన డబ్బులో పెద్ద మొత్తం వాటాను సదరు మహిళకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ మహిళకు డబ్బులు ఇవ్వవద్దని వినోద్ కుటుంబ సభ్యులు చెప్పిచూశారు. అతను మాత్రం వారి మాటలు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని, వినోద్ ను హత్య చేయాలని కుటుబం సభ్యులు నిర్ణయించుకున్నారు.

పధకం ప్రకారం సెప్టెంబర్​ 26న వినోద్​ ను ఓ ఇనుప తీగతో గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత వినోద్​ ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు. మృతదేహాన్ని కారులో హుణసేకొప్ప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, కారుతో సహా నిప్పంటించారు. అటవీ ప్రాంతంలో కాలిపోయిన కారును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందు వినోద్​ ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు.

ఐతే వినోద్ భార్య, కొడుకులను విచారించగా, వారి సమాధానాలు పొంతన లేకుండా ఉడటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా, వినోద్ ను తామే హత్య చేశామని వాళ్లు ఒప్పుకున్నారు. ఈ కేసులో నిందితులు వినోద్ భార్య బిను(42), పెద్ద కొడుకు వివేక్​(21), చిన్న కొడుకు విష్ణు(19), బిను సోదరి కొడుకు అశోక్​(23), వినోద్ సోదరుడు సంజయ్​(36)ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.