సెకండ్ వేవ్ ముగింపు డేట్ అదేనా?

దేశంలో కరోనా స్వైర వివాహారం చేస్తోంది. ఎక్కడ పట్టినా ప్రమాద స్థాయిలో కేసులు నమోదు అవుతన్నాయి. కానీ.., కరోనా ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే ఇది పూర్తిగా వ్యతిరేఖ పరిస్థితి. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో వైరస్ వ్యాప్తి చాలా నెమ్మదిగా సాగింది. ఇక మరణాల రేటు కూడా చాలా తక్కువ ఉంటూ వచ్చింది. కానీ.., సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేస్ లు అమాంతంగా పెరుగుతూ పోతున్నాయి. మరి.. ఫస్ట్ వేవ్ ముగిసినట్టే సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుంది? ఇప్పుడు అందరి మదిలో ఉన్నది ఈ ప్రశ్నే. దీనికి సమాధానం తెలియాలంటే మనం కొన్ని లెక్కలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గత ఏడాది జూన్ 18 న భారతదేశంలో 11,000 కేసులు నమోదయ్యాయి, తరువాతి 60 రోజుల్లో ప్రతిరోజూ సగటున 35,000 కొత్త కేసులు నమోదు అవుతూ వచ్చాయి. కానీ.., అంతకు మించి మాత్రం వేవ్ ముందుకి వెళ్ళలేదు.కానీ.., సెకండ్ వేవ్ లో ఫిబ్రవరి 10 న ఇండియాలో 11,000 కేసులు నమోదు అయ్యాయి. తరువాతి 50 రోజుల్లో రోజుకి సగటున 22,000 కేసులు నమోదు అయ్యాయి. ఇక చివరి 10 రోజుల్లో, రోజువారీగా సగటున లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ఇప్పటికే సెకండ్ వేవ్ మన దేశంలో తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ఇంతకు మించి రోజువారీ కేసులు నమోదు అవ్వడం దాదాపు అసాధ్యం. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వాలల్లో, ప్రజల్లో అవగాహన పెరిగింది. జాగ్రత్తలు కూడా పెరిగాయి. దీనితో రానున్న నెల రోజుల్లో ఈ వేవ్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యూకే, అమెరికా వంటి దేశాల్లో కరోనా కేసులు అదుపులోకి వచ్చింది ఇలానే. ఈ గ్యాప్ భారత ప్రభుత్వం కనుక వ్యాక్సినేషన్ పక్రియని వేగవంతం చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే జూన్ రెండొవ వారం నుండి కరోనా సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ప్రజలందరూ జాగ్రత్తగా ఉండక తప్పదు మరి.