బిచ్చగాడు -2 సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా?!.

Who is The Director of Bicchagadu 2 - Suman TV

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. భిన్న చిత్రాలకు విజయ్ ఆంటోని కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. డబ్బింగ్ రూపంలో వచ్చిన సరే ఇక్కడ ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే!

Bichagadu 2 min 1ఎడిటర్ గా కూడా విజయ్ ఆంటోని కొన్ని సినిమాలకు పనిచేయగా, ప్రస్తుతం తొలిసారి ఆయన దర్శకత్వం వహిస్తుండడం విశేషం. విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘బిచ్చగాడు’ సినిమాకి కొనసాగింపుగా ‘బిచ్చగాడు -2’ని ఆయన తన స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించబోతున్నాడు.

ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు.

విజయ్ ఆంటోనీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రానికి సంబంధించిన లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆయనను దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ‘బిచ్చగాడు -2’ చిత్ర పోస్టర్ ను విడుదల చేశాడు.